నిఖిల్ కి కీలకమే

0

ఏదైనా ఒక సినిమా రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయితే ఆ సినిమా ఎఫెక్ట్ హీరో కెరీర్ మీద పడుతుంది. సరిగ్గా నిఖిల్ కి అదే జరిగింది. ‘ముద్ర’ అనే టైటిల్ తో కనిథన్ ను తెలుగులో రీమేక్ చేసాడు నిఖిల్. అయితే ఆ టైటిల్ ఇంకొకరిదంటూ రచ్చ జరిగింది. అప్పటికే ఓ డేట్ అనుకోని మళ్ళీ టైటిల్ మార్చి కొత్త డేట్ ఫైనల్ చేసుకున్నారు. ఏవో ఆర్ధిక ఇబ్బందుల వల్ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కూడా ఓ రెండు మూడు డేట్స్ అనుకున్నారు. ఏవి బయటికి రాకముందే మళ్ళీ వెనక్కి వెళ్లారు.

ఇప్పుడు ఎట్టకేల కు ఈ నెల 29 న నిఖిల్ అర్జున్ సురవరంతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు నిఖిల్ కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించనుంది. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా ఓ హిట్ కొట్టి ‘కార్తికేయ 2’ మొదలు పెట్టి కూల్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ తో సినిమా ను మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు కుర్ర హీరో. మరి నిఖిల్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ సినిమా అతనికి ఓ హిట్ ఇస్తుండా చూడాలి.
Please Read Disclaimer