దగ్గుబాటివారందరూ ఒకే ఫ్రేమ్ లో..

0

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత- వినాయక్ రెడ్డి వివాహం రీసెంట్ గా జైపూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు.. సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు.. సల్మాన్ – వెంకీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రానా దగ్గుబాటి తన బాబాయ్ కూతురి వివాహ వేడుక నుండి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.

రానా తన ట్విట్టర్ ఖాతా “ఇంటి దగ్గర మరో జంటకు సుదీర్ఘమైన.. సంతోషకరమైన ప్రయాణం మొదలైంది #ఆశ్రిత వినాయక్.” రానా మూడు ఫోటోలు మాత్రమే పోస్ట్ చేశాడు కానీ మూడు సూపర్బ్ ఫోటోస్. ఒక ఫోటోలో కొత్త జంట ఆశ్రిత..వినాయక్ లు ఉన్నారు. రెండో ఫోటోలో కొత్త జంటతో వినాయక్ కుటుంబం అంతా ఫోటోకు పోజిచ్చారు. మరోఫోటోలో కొత్త జంటతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ అందరూ కలిసి పోజిచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీ అనేకంటే.. రామనాయుడుగారి కుటుంబం అంటే ఇంకా బాగుంటుంది.

దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యామిలీ.. వెంకటేష్ ఫ్యామిలీ.. నాగచైతన్య- సమంతా జంట..నాగచైతన్య అమ్మగారు. ఈ ఫోటోలో ఉన్నారు. నాయుడుగారి కుటుంబ సభ్యులలో దాదాపు ఎవరూ మిస్ కాలేదు. ఈ ఫోటోలో హైలైట్ మాత్రం వెంకటేష్ తనయుడు అర్జున్ రామ్ నాథ్.. ఎడమవైపు చివరన నిల్చున్నాడు చూడండి. ఇక సెంటర్ లో టీవీ టవర్ అంత పొడుగ్గా ఉన్న వ్యక్తి గురించి వివరణ అవసరం లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అది సంగతి!