వివాదాల క్వీన్ తో దగ్గుబాటి హీరో దోస్తానా

0

క్వీన్ కంగనతో టై అప్ అయిన సౌత్ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ క్రిష్ సహా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కంగనతో కలిసి పని చేసారు. ఆ క్రమంలోనే క్రిష్ కి ఎదురైన అనుభవం తెలిసినదే. మణికర్ణిక ప్రాజెక్ట్ విషయంలో క్రిష్ తో కంగన క్రియేటివ్ డిఫరెన్సెస్ సంచలనమే అయ్యయి. సినిమా ముగింపులో ఉండగానే క్రిష్ ని పక్కన పెట్టి కంగన తానే దర్శకురాలిగా మారింది. ఆ సినిమాకి అన్నీ తానే అన్నంత ప్రచారం చేసుకుంది. ఆ మూవీ జయాపజయాల బాధ్యత తనదేనంటూ కలరింగ్ ఇచ్చింది. ఇక కంగన ప్రతి యాక్టివిటీనీ విజయేంద్రుడు సమర్థించడంతో క్రిష్ ఎపిసోడ్ లో అసలేమైందో ఎవరికీ అర్థం కాలేదు.

ప్రస్తుతం కంగన- విజయేంద్ర ప్రసాద్ జోడీ `తలైవి` మూవీ కోసం కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి విజయేంద్రుడే స్క్రిప్టు అందించగా తలైవిగా జయలలిత పాత్రలో కంగన నటిస్తోంది. సౌత్ నార్త్ సహా విదేశాల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక కంగన వివాదాల రికార్డ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇటీవల సుశాంత్ సింగ్ మరణానంతరం కంగన బాలీవుడ్ మాఫియాపై చెలరేగుతోంది. ఎవరినీ వదిలిపెట్టకుండా తాట తీస్తోంది. చోప్రాల్ని.. భన్సాలీని కూడా పోలీసులు విచారించాలని బహిరంగంగా ప్రకటించి సంచలనానికే తావిచ్చింది. సరిగ్గా ఇలాంటి సమయంలో హీరో రానా కంగన తో స్నేహం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కంగన ఈరోజు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటితో వీడియో కాల్ ద్వారా ముచ్చట్లాడింది. రానా దగ్గుబాటితో సినిమా చేసేందుకే ఈ ముచ్చట్లు అని కంగననే స్వయంగా వెల్లడించడంతో షాక్ తిన్నారంతా. కంగన అంటేనే వివాదంతో అంటకాగినట్టే. ఇంతకుముందు ఏక్ నిరంజన్ టైమ్ లో పూరీ- ప్రభాస్ బృందంతోనూ గొడవపడిందని ప్రచారమైంది. మళ్లీ ఇన్నాళ్టికి టాలీవుడ్ యంగ్ హీరోతో కంగన పని చేస్తుందన్న వార్త కలకలం రేపుతోంది. రానా ఇప్పటికే సౌత్ సహా నార్త్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో ఈ జోడీ ఏ ప్రాజెక్ట్ కోసం టై అప్ అవుతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.Please Read Disclaimer