ఆ డైరెక్టర్ నా డాన్సర్‌ని గదికి పంపమంటే.. ఉరికించి ఉరికించి కొట్టా: రాకేష్ మాస్టర్

0

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్‌తో రాకేష్ మాస్టర్ విభిన్న శైలి. ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసినప్పటికీ ఆయన ముక్కుసూటి వ్యవహార శైలితో అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కి గురువుగా ఉన్న రాకేష్ మాస్టర్.. శిష్యుడుపై షాకింగ్ కామెంట్స్ వార్తల్లో వ్యక్తి అయ్యారు. అప్పట్లో క్రిష్ణవంశీ, హీరో రామ్‌లతో గొడవపడి కాంట్రవర్శి కొరియోగ్రాఫర్ అయ్యారు. ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసి.. మరెంతమందో శిష్యుల్ని తయారు చేసిన రాకేష్ మాస్టర్‌కి ఇప్పటికీ సరైన అవకాశాలు లేవు. అయితే తనకు ఎందుకు అవకాశాలు రావడంలేదు? ఇండస్ట్రీలో తెరవెనుకు ఏం జరుగుతుందో షాకింగ్ విషయాలను తెలియజేశారు.

మన వాళ్లకు పరాయి డాన్స్ మాస్టర్స్ అంటే మోజు..

నేను మహేష్, రామ్, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరితోనూ పనిచేశారు. అయినప్పటికీ నేను మిగిలిన కొరియోగ్రాఫర్స్‌లా సంపాదించలేకపోయా. కారణం ఏంటంటే.. మన వాళ్లకు పరాయి వాళ్లు అంటే మోజు.. తెలుగు వాళ్లు అంటే చులకన. మీరు ఢీ షో ఫాలో అయితే అర్ధం అయిపోతుంది. తెలుగు వాడు సత్య ఎలిమినేషన్ అప్పుడు నేను నా వాయిస్ గట్టిగా వినిపించా. సినిమాల్లోనే కాకుండా ఇలాంటి డాన్స్ షోలలో కూడా తెలుగు వాళ్లకు ఛాన్స్‌లు ఇవ్వకపోవడంతో నేను బర్న్ అయ్యా. నేను అవకాశాల కోసం అడుక్కోను.. అలాగని పిలిచి పిల్లనివ్వాలా రాకేష్ మాస్టర్ అంటే ఆ టైప్ కూడా కాదు.

వేణు మాస్టర్ దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను

రాంగిరీష్, వేణు పాల్, ప్రేమ్ గోపీ వీళ్లంతా నా ఫ్రెండ్స్.. ఫుడ్ లేకుండా నరకం అనుభవించిన రోజులు ఉన్నాయి. తెలుగు మాస్టర్ అంటే మనోళ్లకు బాగా చులకన. పైగా వీళ్లు తెలుగు వాళ్లే. చాలా కంపెనీలు చుట్టూ తిరిగాము. రామానాయడు గారిని ఇలా చాలా మందిని అవకాశం ఇవ్వమని అడిగాం. ఎవ్వరూ ఇవ్వలేదు.

ఆ టైంలో వేణు సార్ దేవుడులా వచ్చి నాకు అవకాశం ఇచ్చారు. ఆయన నాకు అవకాశాలు ఇవ్వడం వల్లే నాకు పేరు వచ్చింది.

కుక్కకి అన్నం విసిరినట్టుగా.. రాకేష్ మాస్టర్‌కి అవకాశం ఇచ్చారు

నాకు అవకాశాలు వచ్చాయి.. ఇవ్వలేదని నేను అనడం లేదు. కాని ఎలా ఇచ్చేవారంటే.. కుక్కకి అన్నం విసిరినట్టుగా ఇచ్చేవారు. మద్రాస్ నుండి వచ్చే మాస్టర్‌లకు ఇచ్చే వాల్యూ మాకు ఇచ్చేవారు కాదు. తెలుగు వాళ్లు అంటే వీళ్లకు అసహ్యం.

వాళ్లకు టైం ఎక్కువ.. మాకు తక్కువ అక్కడా వివక్షే

రాకేష్ మాస్టర్‌కి మూడు రోజులు టైం ఇస్తారు ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి. అదే సాంగ్‌ను తమిళ కొరియోగ్రాఫర్‌కి ఇస్తే 10 రోజులు ఇస్తారు. అన్నం కూడా తినకుండా పగలూ రాత్రి కాకుండా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజులో నేను సాంగ్ కంపోజ్ చేసి ఇచ్చినవి కూడా ఉన్నాయి. నువ్ ఏడికెళ్తే ఆడి కొస్తా సువర్ణా లాంటి పాటలు చాలానే. నాకు పేరు వచ్చిన తరువాత మాత్రమే పిలిచి ఛాన్స్‌లు ఇచ్చారు తప్ప ముందు ఇవ్వలేదు.

తనికెళ్ల భరణి నాకో సలహా ఇచ్చారు.. అదేంటంటే!!

నేను తనికెళ్ల భరణి కొడుకు కూతురుకి డాన్స్ నేర్పించడానికి పిలుపించుకున్నారు. ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘రాకేష్ మాస్టర్.. మీ జుట్టూ మీ స్టైల్ అంతా డిఫరెంట్‌గా ఉంది. మీరు ముంబాయి నుండి వచ్చానని చెప్పండి మన వాళ్లు మీకు అవకాశం ఇస్తారు తెలుగు వాళ్లంటే ఇవ్వరు’ అన్నారు. ఆయన్ని నేను తప్పుపట్టడం లేదు. నా కష్టాన్ని ఆయన గుర్తించారు. కాని నేను అలా చేయలేనని చెప్పా. తెలుగు వాడినని చెప్పా.

ఆ డైరెక్టర్ కామ పిశాచి.. నా డాన్సర్‌ని పంపించమన్నాడు.. తరిమి తరిమి కొట్టా… తప్పా?

నేను పెద్ద పెద్ద హీరోలతోనే కాదు.. దర్శకులతోనూ పని చేశా. వాళ్లతో నాకు పెద్దగా గొడవలేం లేవు. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తా. నాకు ముప్పల నేని శివ నాకు మంచి షూట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. నా హార్డ్ వర్క్ నచ్చి. కొంతమందికి నేను నచ్చేవాడిని కాదు.

ఒక డైరెక్టర్ ఉన్నాడు వాడు. గోపి గోడమీద పిల్లి అనే సినిమా తీశాడు. వాడికి అమ్మాయిల పిచ్చి. ఫ్లైట్ ఎక్కాం.. నా పక్కనే కూర్చున్నాడు. మాస్టర్.. నా గురించి మా మేనేజర్ చెప్పాడా? అన్నాడు. నాకు అర్ధం కాలేదు. పక్కనే ఉన్న నరేష్.. అన్నయ్యా!! వీడికి అమ్మాయిల పిచ్చి అని చెప్పాడు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి ఇవే మాటలు. నువ్.. ఒక్క డాన్సర్‌ని కూడా నా దగ్గరకు పంపలేదని అన్నాడు. నాకు కోపం వచ్చి తుక్కురేగొట్టా. తరిమి తరిమి కొట్టా వాడ్ని. కొట్ట కూడదా? తప్పా అది. ఇదే రాకేష్ మాస్టర్ చేసిన పని.

అల్లరి నరేష్, శ్రీనివాస రెడ్డి కెమెరామెన్, అల్లరి నరేష్ వాళ్ల బాబాయ్ గిరి గారు.. వీళ్లంతా నేను కొడుతుంటే వెయ్.. వెయ్ ఇంకో నాలుగు తగిలించు మాస్టర్ అన్నారు. అలా కొట్టడం నాకు తప్పు అనిపించలేదు’ అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.
Please Read Disclaimer