సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందేనా…?

0

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులతో గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతపడిపోయిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్స్ ఇప్పుడు క్లోజ్ అయ్యాయి అని చెప్పుకుంటున్నప్పటికీ.. నిజానికి చాలా రోజుల క్రితం నుండే వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మల్టీప్లెక్సెస్ గా రూపాంతరం చెందుతుండటంతో థియేటర్స్ తగ్గుతూ వస్తున్నాయి అని చెప్పవచ్చు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ఓటీటీలు రావడంతో అందరూ ఎంటెర్టైన్మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు కూడా ఓటీటీలలో రిలీజ్ చేస్తుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే నిబంధనలు సడలిస్తూ వస్తుండటంతో థియేటర్స్ కూడా త్వరలోనే రీ ఓపెన్ అవుతాయని అందరూ భావించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఇప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితి అలానే కొనసాగి అక్టోబర్ దాకా థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి లేకపోతే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయి సినిమాలు రిలీజైనా ఒకప్పటిలా ప్రేక్షకులు వస్తారో లేదో అనే అనుమానం అందరిలోనూ ఉంది. జనాలు థియేటర్స్ కి వచ్చేందుకు ఇష్టపడకపోనా కూడా థియేటర్స్ పర్మినెంట్ గా క్లోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. కేవలం ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చిందని సమాచారం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 140 థియేటర్స్.. దేశ వ్యాప్తంగా దాదాపు 700 సింగిల్ స్క్రీన్లు పై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర కాలంలో ప్రభుత్వం అండగా నిలిస్తే మాత్రం థియేటర్స్ ఓనర్స్ గట్టెక్కే పరిస్థితి ఉందని అంటున్నారు. గవర్మెంట్ చొరవ తీసుకొని ప్రాపర్టీ టాక్స్ జీఎస్టీ వంటి వివిధ టాక్సులు నుంచి మినహాయింపు ఇస్తే ఇండస్ట్రీ కాస్త గట్టేక్కే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితిని అర్థం చేసుకొని అండగా ఉంటాయేమో చూడాలి.
Please Read Disclaimer