సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చేనా…?

0

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ గత మూడు నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల కుటుంబాల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక మన టాలీవుడ్ లో కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్స్ జూనియర్ ఆర్టిస్ట్స్.. రోజువారీ సినీ కార్మికులు.. లైట్ బాయ్స్.. సినిమాకి పనిచేసే ఇతర సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కొన్ని షరతులతో సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు జీవోలు జారీ చేసాయి.దీంతో షూటింగ్స్ ఆపేసుకున్న చిత్రాలు చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో మళ్ళీ షూటింగ్స్ తో చిత్ర పరిశ్రమ కళ సంతరించుకుంటుంది.. కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అందరూ భావించారు. అయితే వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగినంత కాలం అదుపులో ఉన్న కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చింది. సడలింపుల అనంతరం రోజురోజుకి అధిక మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని చిన్న చిత్రాలు సీరియల్స్ టెలివిజన్ షోస్ షూటింగ్స్ స్టార్ట్ చేసాయి. ఈ షూటింగ్స్ కారణంగా కొందరు బుల్లితెర నటులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఇప్పటికే టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా వైరస్ సోకింది. దీంతో బయటికి వెళ్లడం కూడా క్షేమం కాదని టాలీవుడ్ స్టార్స్ భావిస్తున్నారట. కొందరు నటీనటులు తమ ఇళ్లకు రాక పోకలు కూడా నిషేదించారట. అలాగే పని వారికి కూడా అనుమతి నిరాకరించారని సమాచారం. ఇక వయసు పై బడిన సీనియర్ నటీనటులు మరింత జాగ్రత్త గా ఉంటున్నారట. ఈ నేపథ్యం లో సినిమా షూటింగ్స్ అంటే మాములు విషయం కాదని.. కొన్ని రోజులు చిత్రీకరణ వాయిదా వేసుకొని పరిస్థితులు చక్కబడిన తర్వాతే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యారట. మరి ఈ కరోనా కష్టాల నుండి బయటపడి సినీ ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని ఎప్పుడు చూస్తుందో చూడాలి.
Please Read Disclaimer