నయనతార ఆమె ప్రియుడికి కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?

0

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారతోపాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లు కరోనా పరీక్షలు చేసుకున్నారు. లాక్ డౌన్ కు ముందు వరకు విదేశాల్లో విహరించిన ఈ జంట ఆ తర్వాత సడలింపులతో దేశానికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ కరోనా పరీక్షలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నయనతార ఆమె ప్రియుడికి కరోనా టెస్టులు చేశారని తెలియడంతో సినీ పరిశ్రమ కూడా ఉలిక్కిపడింది. నయనతార అభిమానులంతా ఆమెకు ఏమై ఉంటుందని ఆరాతీశారు.

ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నయనతార ఆమె ప్రియుడు కరోనా బారిన పడ్డారనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ వార్తలు వెలువడ్డ వెంటనే నయనతార విఘ్నేష్ శివన్ కు చెందిన అధికార ప్రతినిధులు ఈ పుకార్లకు చెక్ పెట్టి వివరణ ఇచ్చారు.

నయనతార విఘ్నేష్ లు ఇద్దరూ బాగానే ఉన్నారని.. వారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ పుకార్లను నమ్మవద్దని వారిద్దరి తరుఫున ప్రకటన విడుదల చేశారు. దీంతో నయనతార ఫ్యాన్స్ తోపాటు ఇండస్ట్రీ కూడా ఊపిరి పీల్చుకుంది.
Please Read Disclaimer