డివైడ్ టాక్ వచ్చినా.. దర్బార్ కలెక్షన్ల తో దుమ్ము రేపేశాడు

0

సరిగ్గా వారం మధ్యలో సినిమా విడుదల అవుతుంటే.. అది ఆ చిత్ర హీరోకే కాదు.. అభిమానులకు కూడా పరీక్షే. అందునా.. పండుగ సీజన్ కు లాస్ట్ వర్కింగ్ రోజున సినిమా విడుదలైతే.. చూస్తూ ఉండిపోవటం మినహా చేయగలిగింది లేదు. అందుకు భిన్నంగా రజనీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే.. అప్పుడే బాక్సాఫీస్ కు పండుగ అన్న మాటకు తగ్గట్లే.. తాజాగా విడుదలైన దర్బార్ మూవీకి తొలిరోజు కలెక్షన్లు భారీగానే వచ్చినట్లుగా చెబుతున్నారు.

తమిళనాడు.. కర్నాటక.. ఆంధ్రా.. తెలంగాణలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాను మంచి కలెక్షన్లే వచ్చినట్లుగా తెలుస్తోంది. అంచనాలు ఏ మాత్రం మిస్ కాని రీతిలో వసూళ్లు వచ్చినట్లు చెబుతున్నారు. స్వదేశం లోనే కాదు. విదేశాల్లోనూ కలెక్షన్ల దుమ్ము రేపినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకూ వినిపిస్తున్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో దర్బార్ కలెక్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా దర్బార్ మూవీకి తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం దర్బార్ మూవీ ఇప్పటి వరకూ రూ.30 కోట్ల కలెక్షన్లు వసూలు అయినట్టుగా చెబుతున్నారు. తమిళనాడులో రూ.20 కోట్లు కొల్లగొడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఓవర్ సీస్ లోనూ సినిమా కు భారీ కలెక్షన్లు దక్కటంతో కాసుల వర్షం కురిసినట్లుగా భావిస్తున్నారు. తొలి రోజు కుమ్ముడు మరెన్ని రోజులు కొనగుతాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ఇటీవల కాలంలో రజనీ సినిమాలన్ని ఒక్కొక్కటిగా బోల్తా కొడుతున్న వేళ.. అందుకు భిన్నంగా దర్బార్ వసూళ్లు దుమ్ము రేపటం ఆసక్తికరమే కాదు..రజనీకి అసలుసిసలు సంక్రాంతి గిఫ్ట్ గా చెప్పక తప్పదు.
Please Read Disclaimer