దర్బార్ పోస్టర్: పక్కా మాస్ గబ్బర్ సింగ్

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ విడుదల చేశారు. కమల్ హాసన్ -మోహన్ లాల్- సల్మాన్ ఖాన్ తమిళ-మలయాళ-హిందీ పోస్టర్లను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం మోషన్ పోస్టర్ రజనీ ఫ్యాన్స్ లో దూసుకెళుతోంది. పోస్టర్ లో సూపర్ స్టార్ తనదైన మాస్ ఆహార్యంతో అదరగొట్టారు. ఈ చిత్రంలో రజనీ పోలీస్ గెటప్ చూస్తుంటే మాస్ గబ్బర్ సింగ్ గా అలరించబోతున్నారా? అన్న అంచనాలు ఏర్పడ్డాయి. రజనీ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా ఫ్యాన్స్ కి ట్రీటివ్వబోతున్నారని అర్థమవుతోంది. ఖాకీ డ్రెస్ లో చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ తనదైన మార్క్ లో కత్తి పట్టుకుని విలన్లను తుక్కు రేగ్గొట్టి అలా స్టైల్ గా కూచున్న పోస్టర్ ఆకట్టుకుంది. రజనీ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఏమిటో చూడాల్సి ఉంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార కథానాయిక. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer