నెహ్రూ స్టేడియంలో ‘దర్బార్’ హంగామా

0

తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నక్రేజీ మూవీ `దర్బార్`. ఎ.ఆర్. మురుగదాస్- రజనీ తొలి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. `చంద్రముఖి` తరువాత రజనీ సరసన నయనతార నాయికగా నటించడం ఆసక్తిని పెంచుతోంది. 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మురుగదాస్ సైతం శంకర్ తీరుగానే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదన్న టాక్ వినిపించింది. అయితే తమిళనాట ఉన్నంత బజ్ ని తెలుగులో క్రియేట్ చేయడంలో దర్బార్ టీమ్ ఎందుకనో తడబడింది.

తాజాగా ఈ సినిమా ఆడియోని చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో లక్షలాదిగా తరలి వచ్చిన రజనీ ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను జీ-తమిళ్ టీవీ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆడియోలో మొత్తం ఆరు వైవిధ్యమైన పాటలున్నాయని తెలుస్తోంది. ఆరు పాటలు ఆరు వేరియేషన్స్ తో వుండేలా యువ సంగీత దర్శకుడు అనిరుద్ ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ముంబై మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో అత్యంత పకడ్భందీగా దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారన్నది కోలీవుడ్ టాక్.

చాలా గ్యాప్ తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా కావడం.. జాతీయ అవార్డ్ గ్రహీత మురుగదాస్ స్థాయి పనిమంతుడి కాంబినేషన్ కావడం రజనీ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. తెలుగు- తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
Please Read Disclaimer