అక్కడ ‘దర్బార్’ స్పెషల్ షో రద్దు

0

మరో రెండు రోజులు ఆగితే.. మూడో రోజు తెల్లవారుజామునే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం వెండి తెర మీద వెలుగులు జిమ్మటం ఖాయం. దక్షిణాది రాష్ట్రాల వారికి ఎంతో ముఖ్యమైన పండుగగా చెప్పే సంక్రాంతికి కొద్ది రోజుల ముందే వచ్చేస్తున్న దర్బార్ చిత్రంపై చాలానే అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ మురుగ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమాను అందరికంటే ముందుగా చూడాలన్న ఆత్రుత రజనీ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడి కి కూడా ఎక్కువే. ఈ కారణం తో దర్బార్ స్పెషల్ షో వేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే కర్ణాటకలో దర్బార్ స్పెషల్ షోను రద్దు చేస్తూ అక్కడి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం లోని జిల్లా కేంద్రమైన కృష్ణగిరి తో పాటు కావేరి పట్టణంలోనూ దర్బార్ మూవీ స్పెషల్ షో వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే.. స్థానిక పోలీసు అధికారులు మాత్రం స్పెషల్ షోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజిల్) స్పెషల్ షో సందర్భంగా రచ్చ రచ్చ చోటు చేసుకోవటం.. అభిమానులు చేసిన విధ్వంసంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ కృష్ణగిరి తో పాటు కావేరి పట్టణం లోని మొత్తం పది సినిమా థియేటర్ల లో ఏ హీరో ప్రత్యేక షోను తాము అనుమతించమని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. రజనీ అభిమానులు తీవ్ర నిరాశ కు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer