సంచలనం.. దాసరి కొడుకు మిస్..!

0

గడిచిన మూడు.. నాలుగు రోజులుగా తెలంగాణలో మిస్సింగ్ కేసుల మీద అదే పనిగా వార్తలు.. ఖండనలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో వందల్లో మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొయిన్ స్ట్రీమ్ మీడియాలో మొదలైన ఈ వార్తల హడావుడి గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ హడావుడి చేస్తున్నాయి.

వీటిని చదివిన వారు అంతకంతకూ భయపడుతున్న వేళ.. బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనను అన్ని మీడియా ఆఫీసులకు పంపారు. వాస్తవాలకు భిన్నంగా మిస్సింగ్ కేసుల మీద వార్తలు వస్తున్నాయని.. వీటి కారణంగా లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయని.. చూసుకొని రాయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పుకార్లు వ్యాపించే వారికి అరందండాలు తప్పవని.. కేసులు నమోదు చేస్తామన్న వార్నింగ్ ఇచ్చేశారు.

ఇలాంటి వేళ.. ఊహించని రీతిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న బయటకు వెళ్లిన ఆయన ఇప్పటివరకూ తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభు కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఆయన ఇదే రీతిలో అదృశ్యమయ్యారని.. కొద్ది కాలం తర్వాత ఆయన మళ్లీ తిరిగి వచ్చారు.ఆ సమయంలో ప్రభు మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేయించింది తన భార్య సుశీలే అని చెప్పటం అప్పట్లో సంచలనం సృష్టించింది. దాసరి మరణం తర్వాత ప్రభుకు.. భార్యతో ఆస్తి వివాదం తలెత్తెంది. అప్పట్లో సుశీల ఆస్తి కోసం ఆందోళన చేశారు. ప్రభుతో సుశీలకు 1995లో లవ్ మ్యారేజ్ జరిగింది. తాజా మిస్సింగ్ కూడా కుటుంబ కారణాలతోనే చోటు చేసుకున్నది తప్ప మరింకేమీ లేదని చెబుతున్నా.. ఈ వ్యవహారం మీద మాత్రం ఒక స్పష్టత రాని పరిస్థితి నెలకొంది.