ఫాదర్ బయోపిక్.. డాటర్ అసిస్టెంట్ డైరెక్టర్

0

హిందీలో బయోపిక్ ల హవా జోరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ లో భాగంగా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ను దర్శకుడు కబీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్నాడు. ’83’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కపిల్ ఇండియన్ టీమ్ కెప్టెన్ గా ఎంపికయిన నాటి నుండి 1983 లో వరల్డ్ కప్ గెలిచేవరకూ జరిగిన సంఘటనలను ప్రధానంగా చూపిస్తారు. రీసెంట్ గా ఈ సినిమా గురించి ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు కపిల్ దేవ్ కుమార్తె అమియా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోందట. అమియాకు 23 ఏళ్ళు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ తండ్రి పాత్రలో సందీప్ పాటిల్ తనయుడు చిరాగ్ నటిస్తున్నాడు. ఆయనే ఈ విషయం గురించి తెలిపాడు. 1983 లో కపిల్ కెప్టెన్సిలో వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ టీమ్ లో సందీప్ పాటిల్ కూడా సభ్యుడు. ఇప్పుడు కపిల్ కుమార్తె.. సందీప్ పాటిల్ తనయుడు ఈ సినిమాకు వర్క్ చేస్తుండడం ఒక విశేషమే. ఈ విషయం గురించి చిరాగ్ మాట్లాడుతూ ‘అమియా నా కంటే చాలా చిన్నది. ఈ సినిమా కోసం పని చేసే ప్రాసెస్ లో నే నేను తనను మొదటిసారి కలిశాను. కబీర్ ఆఫీస్ లో ఉన్న అమియా అక్కడ షెడ్యూల్ ప్లానింగ్ లోనో.. కాస్ట్యూమ్స్.. ఏదో ఒక పనిలో బిజీగా ఉంటుంది’ అంటూ తన డెడికేషన్ ను మెచ్చుకున్నాడు.

ప్రస్తుతం కబీర్ ఖాన్ ఈ సినిమాకు సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ జరుపుతున్నాడు. కీలకపాత్రలు పోషిస్తున్న నటులు క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మే 15 నుండి ప్రారంభిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మధు మంతెన.. విష్ణు ఇందూరి..కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2020 ఏప్రిల్ 10 వ తారీఖున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer