ఆ హీరోకి నిన్న ప్రేమ – నేడు పని – రేపు పెళ్ళంటా..!

0

టాలీవుడ్ యాక్టర్ రానా.. బాహుబలి సినిమా తర్వాత నేషనల్ లెవెల్ పాపులారిటీ పొందిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్తో రానా వరుసగా సినిమాలు చేస్తూ.. మంచి హిట్లు అందుకుంటూ ఫుల్ బిజీ అయ్యాడు. ఓవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళ హిందీ బాషలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రానా నటించిన అరణ్య అనే పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో కెరీర్లో బిజీ అయిపోయాడు. ఇక రానా ఇటీవలే మిహీకా బజాజ్ తో ప్రేమ వ్యవహారం గురించి ప్రకటించినందుకు అభిమానులు మరియు సినీ పరిశ్రమలోని ప్రముఖుల నుండి అభినందనల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగానే రానా పనిలో బిజీ అవ్వడానికి ట్రై చేయడం.. తండ్రి సురేష్ బాబు పెళ్లి ప్రస్తావన తీయడం భలే ఉంది!

ఇక రానా ఇటీవలే ట్విట్టర్ లో కొత్తగా తన ఫోటో పోస్ట్ చేసాడు. తన ల్యాప్ టాప్ తో పనిలో పూర్తిగా మునిగిపోయిన ఫోటోను బయట పెట్టాడు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తే.. అందులో డీవీడీలు – పుస్తకాలు ఇతర ముఖ్యమైనవి అక్కడ ఉండగా.. వాటికీ రానా ‘లైఫ్’ అనే ట్యాగ్ మెన్షన్ చేయడం ఆసక్తి రేకెత్తించే విషయం. మరో విషయం ఏమిటంటే.. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లిక్ చేశారట. ఈ లెక్కన రానా మళ్లీ తన సినీ వర్క్ చేసినట్లే అని అర్ధమవుతుంది. ఇక రానా ప్రేమ పై స్పందించిన సురేష్ బాబు.. త్వరలో పెళ్లి ఫిక్స్ చేస్తామని చెప్పడం విశేషం. రానా ప్రేమ పై సురేష్ బాబు స్పందిస్తూ.. అందరి లాగే నేను కూడా షాక్ అయ్యాను. రానా – మిహీక మంచి ఫ్రెండ్స్ అని తెలుసు కానీ ప్రేమలో ఉన్నారని తెలిసి ఆశ్చర్య పోయానని తెలిపారు. లాక్ డౌన్ వలన ఎలాంటి ముహుర్తాలు ఫిక్స్ చేయలేక పోతున్నాం. ఇక డిసెంబర్ లోపు పెళ్లి చేయాలనుకుంటున్నాం” అంటూ ఆయన తెలిపారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home