కామ్రేడ్ చాలా జోరు మీదున్నాడు

0

మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోస్ లో టాప్ ప్లేస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ విడుదలకు చాలా టైం ఉన్నప్పటికీ బిజినెస్ కు సంబంధించిన డీల్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. టీజర్ వచ్చాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గీత గోవిందం ని మించిన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

దీంతో ట్రేడ్ భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. నిర్మాతలు మైత్రి సంస్థ ఎక్కడిక్కడ రీజనబుల్ డీల్స్ అనిపించినవి ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తోంది. అత్యాశకు పోకుండా ట్రైలర్ వదిలాక ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది అనే ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా పూర్తి చేస్తున్నారు

విశ్వసనీయ సమాచారం మేరకు నైజామ్ సీడెడ్ కు కలిపి 11 కోట్లకు తీసేసుకున్న చదలవాడ శ్రీనివాసరావు అందులో నైజామ్ హక్కులను 7.5 కోట్లకు ఏషియన్ సునీల్ కు ఇచ్చేశారని టాక్. మిగిలిన మొత్తం కంటే ఎక్కువె సీడెడ్ నుంచి వస్తుంది కాబట్టి ఆయన విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆంధ్ర ప్రాంతానికి 10 కోట్ల దాకా డిమాండ్ ఉంది.

ఇక ఓవర్సీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. దాని మీద అవగాహనా ఉన్న నిర్మాతలు కావడంతో ఆఫర్స్ కి టెంప్ట్ కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషాకా బాష విడిగా క్రేజ్ రావడంతో ఎంత లేదన్న నలభై నుంచి యాభై కోట్ల మధ్య కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ఉన్నాడు
Please Read Disclaimer