కామ్రేడ్ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే

0

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ నిన్న శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి యావరేజ్ రివ్యూస్.. ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ‘డియర్ కామ్రేడ్’ మొదటి రోజు హంగామా ఎలా ఉందో చూద్దాం.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘డియర్ కామ్రేడ్’ 11 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ ఓపెనింగ్ కలెక్షన్ ఫిగర్స్ విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దాదాపు రూ. 33 కోట్లకు అమ్మడం జరిగింది. ఆ లెక్కలో చూసుకుంటే ఇవి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. ఇక మొదటి వారాంతంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుంది అనేదాన్ని బట్టి ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ పై మనం ఒక అంచనాకు రావచ్చు.

ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 3.05 cr

సీడెడ్: 0.87 cr

ఉత్తరాంధ్ర: 0.87 cr

కృష్ణ: 0.33 cr

గుంటూరు: 0.63 cr

ఈస్ట్ : 0.91 cr

వెస్ట్: 0.52 cr

నెల్లూరు: 0.27 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 7.45 cr

కర్ణాటక: 0.71 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.32 cr

అమెరికా: 1.60 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 11.08 cr
Please Read Disclaimer