చిన్నితెరపై కామ్రేడ్ నీడలు

0

డిజిటల్ విప్లవంలో కొత్త మార్పులకు నాంది పలికిన అమెజాన్ ప్రైమ్ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల స్ట్రీమింగ్ విషయంలో దూకుడు పెంచింది. 14 రోజులు మొదలుకుని 50 గడువు దాకా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోల క్రేజీ మూవీస్ వరసబెట్టి విడుదల చేస్తోంది. మహర్షి – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ – బ్రోచెవారెవరురా – ఆమె – సీత – రాజ్ దూత్ ఇలా వారానికి ఒకటి రెండు చొప్పున లేటెస్ట్ రిలీజులన్ని ఆన్ లైన్ బజార్ లో తన కస్టమర్లకు అందిస్తోంది. ఇదే జోరు ఇకపై కూడా కొనసాగిస్తున్న ప్రైమ్ ఇప్పుడు మరో రెండు సిద్ధం చేసింది.

ఈ నెల 23న సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే వదులుతుండగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మల్టీ లాంగ్వేజెస్ లో ఆగస్ట్ 30న రిలీజ్ చేస్తోంది. ఈ రెండు రిలీజ్ డేట్ నుంచి కేవలం నెల రోజులు వ్యవధిలో వస్తున్న సినిమాలు కావడం గమనార్హం. నిర్మాతలు ముందు అనుకున్న యాభై రోజుల గడువు అన్నింటికి వర్తించడం లేదన్న క్లారిటీ వచ్చేసింది. ట్రెండ్ చూస్తుంటే పోటీ కంపెనీలు కూడా ఇదే స్థాయిలో కొత్త సినిమాలను ఆన్ లైన్ తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అధిక పెట్టుబడులకు రెడీ అవుతుండగా మీడియా రంగంలో ఎప్పటినుంచో ఉన్న సన్ నెట్ వర్క్ జీ లాంటి సంస్థలు కూడా ఈ యాప్ వీడియో స్ట్రీమింగ్ వైపు ఫోకస్ పెంచుతున్నాయి. సన్ ఇప్పటికే వరల్డ్ టీవీ ప్రీమియర్స్ కన్నా ముందే తన సినిమాలు ఆన్ లైన్ లో ఉంచుతోంది. జీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. వచ్చే నెల నుంచి ఇదే తరహాలో కొత్త సినిమాల ప్రీమియర్లు కంటిన్యూ అయితే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం గురించి మళ్ళీ ఆలోచిస్తారేమో.
Please Read Disclaimer