యుఎస్ కామ్రేడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?

0

భారీ అంచనాల మధ్య మొన్న శుక్రవారం విడుదలైన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని అందుకునేలా కనిపించడం లేదు. వీకెండ్ ఉన్నప్పటికీ టాక్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో నిర్మాతలు ఆశించిన బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేక కామ్రేడ్ స్లోగా సాగుతున్నాడు. గీతా గోవిందం – అర్జున్ రెడ్డి – పెళ్లి చూపులతో అక్కడో బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండకు యుఎస్ రిపోర్ట్స్ షాక్ ఇస్తున్నాయి. మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి 3 లక్షల డాలర్లతో వావ్ అనిపించిన కామ్రేడ్ ఆ తర్వాత అనూహ్యంగా డౌన్ అయిపోయాడు. కేవలం 7 లక్షల డాలర్లతో సర్దుకుపోయి మిలియన్ మార్క్ కు దూరంలో ఆగిపోయాడు.

ఒకవేళ యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యేదే కానీ కామ్రేడ్ కంటెంట్ అక్కడి ఆడియన్స్ కు సైతం కనెక్ట్ కాలేకపోయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. వీకెండ్ హాలిడేస్ అయినప్పటి రెండు మూడో రోజు కామ్రేడ్ ఫిగర్స్ అంతకంతకూ పడిపోవడమే జరిగింది. ప్రీమియర్లతో $310K తో గ్రాండ్ ఓపెనింగ్ దక్కగా శుక్రవారానికి అది $154Kకి పడిపోయిది. శనివారం $148K తో తగ్గుదల చూపించగా ఆదివారం ఊహించని రీతిలో కేవలం $80K డాలర్లతో తానెంత వీక్ స్టేటస్ లో ఉన్నానో నిరూపించాడు.

ఇక ఈ రోజు నుంచి పరిస్థితి అంచనా వేయడం కూడా కష్టమే. మిలియన్ మార్క్ కి ఇంకా మూడు లక్షల డాలర్ల దూరంలో ఉన్న కామ్రేడ్ అది సాధించడమే పెద్ద లక్ష్యంగా కనిపిస్తోంది. అక్కడి బయ్యర్లకు నష్టం ఖాయమని ట్రేడ్ రిపోర్ట్. మొత్తానికి విజయ్ దేవరకొండకు భారీ షాక్ ఇచ్చే దిశగా డియర్ కామ్రేడ్ ప్రయాణించడం అభిమానులు ఊహించనిది. ఇండియాలోనూ నాలుగు బాషల రిలీజ్ అంతగా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదని కలెక్షన్స్ చెబుతున్నాయి. ఇంకో రెండు మూడ్ రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
Please Read Disclaimer