మిలియన్ కోసం కామ్రేడ్ కోటి తిప్పలు

0

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ ఫలితం డిసైడ్ అయిపోయినా కనీసం ఫస్ట్ వీక్ అయినా ఎంతో కొంత వర్క్ అవుట్ చేసుకుని బయటపడాలన్న బయ్యర్ల తాపత్రయం ఆశించిన వసూళ్లు రాబట్టడం లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది. సోమవారానికి అతి కష్టం మీద $700K మార్క్ చేరుకున్న కామ్రేడ్ బాలన్స్ ఉన్న $300K డాలర్ల కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేలా ఉంది. స్థానిక డిస్ట్రిబ్యూటర్లు దీని కోసం రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నా ఉపయోగం ఉండటం లేదట.

నిన్న మంగళవారం వన్ ప్లస్ వన్ స్కీం కింద ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అన్నా ఫిగర్స్ లో ఏమంత మార్పు లేకపోవడం అక్కడి ప్రేక్షకుల తీర్పుని తేటతెల్లం చేస్తోంది. అర్జున్ రెడ్డి గీతగోవిందం రేంజ్ లో ఏదేదో ఊహించుకుని కొన్నవాళ్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి సంగతి పక్కన పెట్టి ఎంత నష్టం తగ్గొచ్చు అనే దాని మీద ప్రస్తుతం అక్కడి లెక్కలు సాగుతున్నాయి

డ్యామేజ్ జరిగాక రిపేర్ల పేరుతో ట్రిమ్మింగ్ చేయడం కాలేజీ సాంగ్ ని జోడించడం లాంటి ట్రిక్కులు జనాన్ని ఆకట్టుకోవడం లేదు. స్టార్ హీరోకైనా ఇలాంటి ఎత్తుగడలు ఈ కాలంలో పనిచేయవు. అలాంటిది విజయ్ దేవరకొండ దీనికేమి మినహాయింపు కాదు. అసలు పోటీనే లేని టైంలో కూడా ఇంత నీరసంగా రన్ రావడం అభిమానులకు సైతం మింగుడుపడటం లేదు.

ప్రమోషన్ విషయంలో అంతా తానై నడిపించిన విజయ్ పోస్ట్ రిలీజ్ టైంలోనూ కష్టపడుతున్నాడు కానీ ఆ కారణంగా టికెట్లు తెగే పరిస్థితి కనిపించడం లేదు. మొదటి మూడు రోజులు అయ్యాక సోమవారం విపరీతమైన డ్రాప్ చూపించిన కామ్రేడ్ నిన్న మంగళవారం సైతం అంతకన్నా చాలా తక్కువే రాబట్టాడని ట్రేడ్ రిపోర్ట్.
Please Read Disclaimer