ఇస్మార్ట్ శంకర్ కి మళ్ళీ పండగేనా!

0

నిన్న ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ ఫ్యాన్స్ ని యూనిట్ ని టెన్షన్ లో పెట్టగా పూరి క్యాంప్ కు మాత్రం ఇది జోష్ ఇచ్చేదే. కారణం తెలిసిందే. మొదటివారం ఫుల్ కంట్రోల్ తో బాక్స్ ఆఫీస్ వసూళ్లను తన గ్రిప్ లో పెట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ ఒకవేళ నిన్న వచ్చిన డియర్ కామ్రేడ్ కనక యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది వచ్చేది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో వసూళ్లపై ప్రభావం పడేది. కానీ మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ డియర్ కామ్రేడ్ లో లేదని తేలిపోవడంతో గాలి మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ వైపే వీస్తుంది.

ఈ రోజు రేపు రెండో వీకెండ్ చాలా కీలకంగా మారిన తరుణంలో రామ్ సినిమాకు ఈ పరిణామం కలిసొచ్చేదే. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లో ఉన్న శంకర్ ఇప్పుడు తెస్తున్న రెవిన్యూ అంతా లాభాల్లోకి కౌంట్ అవుతోంది. రామ్ కెరీర్ బెస్ట్ ని సైతం దాటేసింది. సో డియర్ కామ్రేడ్ స్లో అయితే అక్కడ ఇస్మార్ట్ శంకర్ పికప్ కావడం ఖాయమే. పైగా సోమవారం నుంచి మళ్ళీ ఒకరకమైన వ్యాక్యూమ్ వస్తుంది.

కింది కేంద్రాల్లో డియర్ కామ్రేడ్ కనక వీక్ అయితే ఆ అవకాశాన్ని ఇస్మార్ట్ శంకర్ ఉపయోగించుకుంటాడు. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకో మూడు నాలుగు రోజులు ఆగితే అప్పుడు క్లారిటీ వస్తుంది. మొదటి రోజు గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్న డియర్ కామ్రేడ్ వారాంతం వరకు ఓకే అనిపించుకున్నా అసలైన సవాల్ మండే నుంచి ఉంటుంది. దీని సంగతి ఏమో కానీ ఇస్మార్ట్ శంకర్ కు మళ్ళీ ఆగస్ట్ 2 దాకా ఎలాంటి టెన్షన్ లేదు. ఆ రోజూ వచ్చే గుణ 369- రాక్షసుడు రెండూ డిఫరెంట్ జోనర్లు కాబట్టి ఆందోళన అవసరం లేదనిపిస్తోంది
Please Read Disclaimer