స్లో మోషన్ లో రెచ్చిపోయిన రౌడీగారు

0

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా టీజర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు భరత్ కమ్మ. 1.05 నిముషాల పాటు సాగే ఈ టీజర్లో దర్శకుడు సినిమా నేపథ్యాన్ని చూపించాడు కానీ ప్లాట్ ను రివీల్ చేయలేదు.

కాలేజిలో విద్యార్థుల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. స్లో మోషన్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి ఒకరి దవడ పగలగొడతాడు.. ఇది వయోలెన్స్. నెక్స్ సీన్ లో వాన జల్లు పడుతూ ఉంటే విజయ్ – రష్మికల జోడీ ఘాటైన ఆధర చుంబనంలో మునిగి తేలుతుంటారు. ఘాటు రొమాన్స్ అన్నమాట. అంటే ఒకే టీజర్లో అటు వయోలెన్స్ ను ఇటు రొమాన్స్ ను కలిపి చూపించారు. ఈ రెండు సీన్లు జరిగే సమయంలో “కడలల్లే వేచె కనులే కదిలేను నదిలా కలలే” అంటూ మెలోడియస్ గా సిడ్ శ్రీరాం గాత్రంలో పాట వినిపిస్తూ ఉంటుంది. ‘గీత గోవిందం జోడీ ఘాటైన లిప్ లాక్’ అనేది ఈ టీజర్ లో హైలైట్. ఓవరాల్ గా చూస్తే మాత్రం టీజర్ లో సూపర్ అనదగ్గ అంశమైతే ఏమీ లేదు.

కాలేజిలో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం సాగుతోంది కదా. కాలేజి గొడవలు చూపించడంతో అది కన్ఫాం అయినట్టే. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా స్టొరీ గురించి కాస్తైనా క్లూ దొరుకుతుందేమో. ఆలస్యం ఎందుకు.. ఒకసారి కామ్రేడ్ గారికి విప్లవ వందనాలు చెప్పండి..!
Please Read Disclaimer