కామ్రేడ్ అమెరికా ప్రీమియర్స్ కలెక్షన్స్ జోరు

0

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రీమియర్ షోస్ కాస్త ముందుగానే పడతాయి కదా.. దీంతో ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అంచనాలకు తగ్గట్టే ‘డియర్ కామ్రేడ్’ ప్రీమియర్స్ లో స్ట్రాంగ్ కలెక్షన్ నమోదు చేసింది.

తాజా సమాచారం ప్రకారం 191 లోకేషన్స్ నుండి $305K గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. మరో 7 లొకేషన్స్ నుండి కలెక్షన్ వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ తో 2019 సంవత్సరానికి హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ‘మహర్షి’ ($516K) ఉండగా రెండవ స్థానంలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ($483K) ఉన్నాయి. ‘వినయ విధేయ రామ’.. ‘ఎఫ్ 2’.. ‘మజిలీ’ ప్రీమియర్ కలెక్షన్స్ ను ‘డియర్ కామ్రేడ్’ ఇప్పటికే దాటేయడం గమనార్హం.

పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ‘డియర్ కామ్రేడ్’ కు ఫస్ట్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్లస్ కానుంది. మరి ఈ కామ్రేడ్ వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరేందుకు ఎంత సమయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer