డెబ్యూ డైరెక్టర్ తో మంచు మనోజ్ సినిమా!

0

‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ గ్లిమ్స్ లో ‘ఇవ్వలే…వచ్చింది’ అంటూ తన గ్యాప్ గురించి బన్నీ చెప్పే డైలాగ్ ఇప్పుడు చాలా మంది హీరోలకి పర్ ఫెక్ట్ గా సింక్ అవుతుంది. అందులో మంచు మనోజ్ ఒకడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. నిజానికి ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయలనుకున్నాడు కానీ ఏదీ సెట్ అవ్వలేదు. అందుకే మనోజ్ కి గ్యాప్ వచ్చింది.

అయితే వచ్చిన గ్యాప్ ని ఇంకా పెంచకుండా ప్రస్తుతం ఒక సినిమా సెట్ చేసుకున్నాడు. శ్రీకాంత్ అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఈ సినిమా కోసమే కాస్త బరువు తగ్గి అయ్యి మళ్లీ పాత లుక్ లోకి వచ్చేసాడు. తన లుక్ ఎలా ఉందో.. ఒక టెస్ట్ కూడా వేసుకున్నాడు. అందరూ బాగుందనడంతో అదే లుక్ కి ఫిక్సయ్యాడు. అక్టోబర్ నుండి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.

అయితే గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలంటే అంతో ఇంతో కొత్త ధనం ఉండాలి. అప్పుడే ఏ హీరో అయినా మళ్లీ హిట్ అందుకోగలడు. అలా కాకుండా మూస ధోరణిలో సినిమా అంటే మాత్రం కష్టమే. మరి మనోజ్ చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండడంతో శ్రీకాంత్ చెప్పిన కథలో ఏదో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండే ఉంటుంది. అదేంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఏదేమైనా మంచు మనోజ్ మళ్లీ సినిమా చేస్తుండటంతో మంచు అభిమానుల్లో ఆనందం నెలకొంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home