ప్రపంచ సుందరి కల నెరవేరేనా?

0

రెండేళ్ల క్రితం ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్. ఇలా అందాల పోటీలో కిరీటం దక్కగానే అలా బాలీవుడ్ లో ప్రవేశించాలన్న కోరికను వెలిబుచ్చింది. పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంది. అమీర్ ఖాన్- షారూక్ – సల్మాన్ లాంటి స్టార్ల సరసన నటించలని కలగంది. కానీ ఎందుకనో వెంటనే ఏదీ అంత సులువుగా సాధ్యం కాలేదు.

రెండేళ్ల గ్యాప్ తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నుంచి ఆఫర్ అందుకుంది. ఆ క్రమంలోనే మానుషి ఎంతో ఎగ్జయిట్ మెంట్ ని ఫీలైంది. అంత పెద్ద సంస్థలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ అక్షయ్ సరసన పృథ్విరాజ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హిస్టారికల్ కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇందులో మానుషి సంయుక్త అనే పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. పృథ్వారాజ్ చౌహాన్ కి ముగ్గురు భార్యలు. అందులో ఒక భార్య సంయుక్త. అందులో ఎంతో ఎమోషనల్ గా ఉండే భార్యామణి. తన పాత్రను మానుషికి ఆఫర్ చేశారు. ఈ సినిమా 2020 దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఐశ్వర్యారాయ్- సుశ్మితా సేన్- ప్రియాంక చోప్రా లాంటి ప్రపంచ సుందరీమణులతో పోలిస్తే మానుషి ఎందుకనో ఆశించినంత వేగంగా అవకాశాలు అందుకోలేకపోయింది. సరైన అవకాశమే.. నిరూపించుకుంటే. మరి మానుషి నిలబెట్టుకుంటుందా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer