డిసెంబర్ లో యంగ్ హీరోల హంగామా

0

వచ్చే ఏడాది జనవరిలో మహేష్ బాబు – అల్లు అర్జున్ తో పాటు కళ్యాణ్ రామ్ వంటి బడా హీరోలు సందడి చేయడానికి రెడీ అవుతుంటే దానికంటే ముందే డిసెంబర్ నెలలో తమ సినిమాలతో సందడి చేయబోతున్నారు యంగ్ హీరోలు. నితిన్ ‘భీష్మ’ క్రిస్మస్ స్పెషల్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ని రీచ్ అయ్యేందుకు షూటింగ్ వేగవంతం చేసారు.

ఇక డిసెంబర్ లో మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ‘ప్రతి రోజు పండగ రోజే’ సినిమాతో థియేటర్స్ లోకి రానున్నాడని సమాచారం. ప్రస్తుతానికైతే మేకర్స్ రిలీజ్ తేదిని ప్రకటించలేదు కానీ. డిసెంబర్ 20 న ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకు రావాలనుకుంటున్నారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలాగే శర్వానంద్ నటిస్తున్న ’96’ రీమేక్ కూడా డిసెంబర్ లొనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటి వరకూ నితిన్ ‘భీష్మ’ ఒక్కటే అధికారికంగా డిసెంబర్ లో రిలీజ్ అంటూ తెలిపారు. ప్రతి రోజు పంగడే – అలాగే 96 రీమేక్ ల విడుదల తేదీలను కూడా అతిత్వరలోనే ప్రకటించనున్నారు. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు ప్రకటిస్తారో.. ఈ యంగ్ హీరోల మధ్య డిసెంబర్ లో ఎలాంటి పోటీ ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.
Please Read Disclaimer