డిసెంబర్ రిలీజులు: క్లాస్ Vs ఊరమాస్

0

క్లాసు మాసు తేడాలు లేవని ప్రేక్షకులకు నచ్చే సినిమా హిట్ అని.. నచ్చని సినిమా ఫ్లాప్ అని కొందరు జంబలకిడి పంబ లాజిక్కులు చెప్తుంటారు. అలా అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ ఎందుకు క్లాస్ ఆడియన్స్ లలో ఎక్కువమందికి నచ్చలేదు. మొహన్ లాల్ ‘మనమంతా’ ఎందుకు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్లాస్ మాస్ సినిమాలకు తేడా ఉంటుంది. అయితే కొన్ని సినిమాల్లో యూనివర్సల్ అప్పీల్.. అన్నీ ఎలిమెంట్స్ ఉండడం కారణంగా అందరూ చూస్తారు అంతే.

ఇక డిసెంబర్ లో క్రిస్మస్ వరకూ విడుదల కానున్న సినిమాల విషయమే తీసుకుంటే క్లాస్ Vs ఊరమాస్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. డిసెంబర్ లో ముందుగా రిలీజ్ కానున్న సినిమా ‘వెంకీమామ’ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి క్లాస్ ఫిలిం కిందకే వస్తుంది. అటు వెంకీకి ఇటు చైతుకు కుటుంబ ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ కాబట్టి మాస్ అంశాలు.. బోల్డ్ అంశాలకు స్కోప్ తక్కువే. తర్వాత వారంలో రిలీజ్ అయ్యే తేజు-మారుతిల ‘ప్రతిరోజూ పండగే’ కూడా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన క్లాస్ సినిమానే. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా ‘రూలర్’ ఎలా ఉంటుందో ఆ టీజర్ శాంపిల్ ఇచ్చేసింది. ఊరమాస్ బాలయ్య స్టైల్ ఫిలిం. డిసెంబర్ లో రిలీజ్ కానున్న మరో మాస్ సినిమా ’90ML’. కార్తికేయ గుమ్మకొండ యువ హీరో.. యూత్ ఆడియన్స్ లైక్ చేసే హీరో అయినప్పటికీ ఈ సినిమా కంటెంట్ మాత్రం మోటుగా.. యమా నాటుగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్టే ఉంది.

మరి ఈ క్లాసు మాసుల పోరాటం లో ఏ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటాయో వేచి చూడాలి. ఇవి కాకుండా రాజ్ తరుణ్ ‘ఇద్దరిలోకం ఒకటే’ ఒక లవ్ స్టొరీ. ఇది యూత్ ను టార్గెట్ చేసిన సినిమా. ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ డిసెంబర్ నెలలో బాక్స్ ఆఫీసును ఎవరు షేక్ చేస్తారో తెలియాలంటే నెలాఖరు వరకూ ఎదురు చూడక తప్పదు.
Please Read Disclaimer