‘తలైవి’ పై జయ మేనకోడలి తొలి విజయం!

0

కంగనా రనౌత్ జయలలితగా కనిపించిన ఫస్ట్ లుక్ ద్వారా వార్తల్లోకి వచ్చిన ‘తలైవి’ సినిమా విషయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తొలి విజయం సాధించారు. తన మేనత్తపై వచ్చే సినిమాలన్నింటి మీదా దీప కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు రావడానికి వీల్లేదని దీప వాదిస్తూ ఉన్నారు.

ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమెకు పిటిషన్ వేసే అర్హత ఉందని తేల్చింది. జయలలిత బతికి ఉన్న రోజుల్లో దీపకు పెద్దగా గుర్తింపు లేదు. జయలలిత కూడా వాళ్లను పట్టించుకోలేదు. అసలు వీళ్లు వార్తల్లో కూడా కనిపించే వాళ్లు కాదు. జయలలిత మరణించాకే దీప – ఆమె సోదరుడు వెలుగులోకి వచ్చారు. రాజకీయం అంటూ హల్చల్ చేశారు.

అయితే రాజకీయంగా రాణించలేక కామ్ అయిపోయారు. ఇంతలోనే జయలలిత బయోపిక్స్ తెర మీదకు వచ్చాయి. అలాగే గౌతమ్ మీనన్ ఒక వెబ్ సీరిస్ ను ప్లాన్ చేశాడు. వీటి మీద దీప యుద్ధం ప్రారంభించింది. తమ అనుమతి లేకుండా జయలలిత బయోపిక్స్ రావడానికి వీల్లేదని అమె అంటోంది.

ఈ నేపథ్యంలో కోర్టు ఆమె వాదన పట్ల సానుకూలంగా స్పందించింది. ‘తలైవి’ మేకర్స్ దీపకు సమాధానం ఇవ్వాలని – వారిపై దీప పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. తన మేనత్త మీద ఏ సినిమా వచ్చినా దాని స్క్రిప్ట్ తనకు చూపించాలని తను ఓకే చెప్పిన తర్వాతే ఆ సినిమాలు రూపొందాలని అంటోంది!
Please Read Disclaimer