యాసిడ్ బాధితుల తో దీపిక బర్త్ డే

0

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె అప్రతిహత జైత్ర యాత్ర గురించి తెలిసిందే. పద్మావత్ 3డి లాంటి హిస్టారికల్ మూవీతో 600కోట్ల వసూళ్లు తెచ్చిన ఏకైక బాలీవుడ్ నాయికగా రికార్డులకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోవర్స్ ని తెచ్చుకున్న సమకాలీన నటిగా దీపిక నీరాజనాలు అందుకుంటోంది. నేటితో దీపిక 34వ పడిలోకి అడుగు పెట్టింది. నిన్నటి రోజున నవవసంతానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. 2020 దీపికకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. సామాజిక దృక్ఫథం ఉన్న నటిగా ఈసారి ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకుని అందులో నటించడమే గాక.. తనే నిర్మాతగానూ మారింది. యాసిడ్ బాధితురాలు సామాజిక కర్త లక్ష్మీఅగర్వాల్ జీవిత కథలో నటిస్తోంది. ఛపాక్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి యాసిడ్ బాధితులతో దీపిక మమేకం అవుతోంది.

సొమవారం తన పుట్టిన రోజు సందర్భంగా యాసిడ్ బాధితుల మధ్య ఘనంగా పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది దీపిక. లక్నోలోని యాసిడ్ బాధితులను పరామర్శించి వారి మధ్యనే వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఈసారి బర్త్ డే చాలా స్పెషల్ గా ఉందంటూనే బరువెక్కిన హృదయం తో స్పందించింది. అ తర్వాత అందరితో సెల్ఫీలు దిగి బాధితుల లైఫ్ స్టైల్ ని అడిగి తెలుసుకుంది. దీపిక వెంట భర్త రణవీర్ సింగ్ కూడా ఉన్నాడు. దీపికను అర్ధం చేసుకున్న మంచి భర్తగా రణవీర్ కు ప్రశంసలు దక్కడం విశేషం. రణవీర్ కూడా భార్య వెంటే ఉండి యాసిడ్ బాధితురాళ్లతో సరదాగా ముచ్చటించాడు. ముంబై నుంచి లక్కో బయలు దేరే ముందు ముంబై ఎయిర్ పోర్టులో దీపిక అభిమానులు కేక్ తో ఎదురుచూసిన వైనం ఆసక్తి రేకెత్తించింది.

ఆ సమయంలోనే ఓ అభిమాని వచ్చి మా మధ్యలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరగా అందుకు దీపిక ఒకే చెప్పి కేక్ కట్ చేసి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ప్రతి ఏడాది స్నేహితులు.. కుటుంబ సభ్యులు.. సినిమా యూనిట్ తో సెలబ్రేషన్స్ జరుపుకునే దీపిక ఈ ఏడాది మాత్రం ఛపాక్ కోసం ప్లాన్ మార్చుకుంది. యాసిడ్ బాధితురాలిగా అరుదైన అవకాశం దక్కిందని.. ఛపాక్ చిత్రం వ్యక్తిగతంతో తనని ఎందో కదిలించిందని దీపిక ఈ సందర్భంగా తెలిపింది.
Please Read Disclaimer