ఎమోషనల్ అయి పోయిన దీపిక

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటించిన ‘చపాక్’ ట్రైలర్ నిన్న విడుదలయింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది. యాసిడ్ దాడి బాధితురాలిగా పూర్తిగా డీ-గ్లామరైజ్డ్ లుక్ లో కనిపించిన దీపిక పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపిక నటన గురించి అందరికీ తెలిసిందే కాబట్టి మరో సారి ప్రత్యేకం గా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా దీపిక ఎమోషనల్ కావడం అందరినీ కదిలించింది.

ఈ సినిమా లక్ష్మి అగర్వాల్ అనే యాసిడ్ దాడి బాధితురాలైన ఒక అమ్మాయి జీవితం ఆధారం గా తెరకెక్కింది. చక్కని రూపురేఖలతో ఉన్న అమ్మాయి అయిన ఈ లక్షి15 ఏళ్ళ వయసులో 32 ఏళ్ళ వ్యక్తి యాసిడ్ దాడి చేయడంతో కురూపిగా మారిపోతుంది. ఆ తర్వాత లక్ష్మి ఎలా తన జీవితంలో పోరాడింది.. ఏం చేసింది అనేది ఈ సినిమా కథ. ఈ కథ ఎవరి హృదయాలను అయినా కదిలించేదే. దీపిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ లక్ష్మి అగర్వాల్ పయనం గురించి ప్రస్తావించింది. లక్ష్మి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తూ ఒక్కసారిగా దీపికకు కంటనీరు ఉబికింది. ఏడుపును అదుపు చేసుకోలేకపోవడంతో పక్కనే ఉన్న దర్శకురాలు మేఘన గుల్జాన్ ను ప్రెస్ వారితో మాట్లాడమని మైక్ ఇచ్చేసింది. ఈ సంఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

స్టార్ హీరోయిన్ అయిన దీపిక ఇలాంటి సినిమా లో నటించడం తో ఒక్కసారిగా యాసిడ్ దాడి బాధితుల సమస్య ఒక్క సారిగా అందరి దృష్టి కి వచ్చింది. యాసిడ్ దాడి బాధితుల గురించి పేపర్లో చూస్తారు.. జనాలు రెండో రోజు వారిని మర్చిపోతారు. మరి ఈ సినిమాతో అయినా యాసిడ్ దాడి బాధితుల పరిస్థితిని ఈ సమాజం అర్థం చేసుకుంటుందని ఆశిద్దాం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10 వ తారీఖు న విడుదల అవుతోంది.
Please Read Disclaimer