మీసాలతో చిన్నప్పుడు స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ప్రస్తుతం ఛపాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్ సినిమా పై విమర్శకులు ప్రశంసలు కురిపించేవిగా ఉన్నాయి. ఇలాంటి పాత్రను చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా దీపిక పదుకునేను అభినందనలతో ముంచెత్తుతున్నారు. పెద్ద ఎత్తున ఈ చిత్రంకు ప్రమోషన్ చేసే ఉద్దేశ్యంతో స్వయంగా దీపిక విభిన్న తరహా లో ప్రయత్నాలు చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దీపిక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్నప్పటి ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో దీపిక తెల్లటి కాస్ట్యూమ్స్ లో ఉంది. మీసాలు కూడా ఉండటం తో ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఫ్యాన్సీ డ్రస్ షో సందర్బంగా ఈ ఫొటో తీసి ఉంటారు. స్కూల్ డేస్ లోనే దీపిక యాక్టింగ్ చేసేదని గతంలో ఆమె సన్నిహితులు చెప్పారు. ఈ ఫొటోను చూస్తుంటే ఏదైనా స్టేజ్ షో కు సంబంధించింది అయ్యి ఉంటుందని కూడా అనిపిస్తుంది.

ఈ ఫొటోతో పాటు ప్రతి పనిని స్పష్టతతో చేయాలి.. ప్రతి ఆలోచన స్పష్టంగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ షేర్ చేసింది. దీపిక పదుకునే ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య కాస్త తగ్గించింది. కాని మంచి కంటెంట్ ఉన్న పాత్రను మాత్రమే చేస్తుంది. దీపిక పదుకునే 2020లో ఛపాక్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ ఆమె అభిమానులు నమ్మకం గా చెబుతున్నారు.
Please Read Disclaimer