రెడ్ డ్రెస్.. సూపర్ హాట్

0

బాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ దీపిక పదుకొనె వివాహం తర్వాత కూడా నటన కొనసాగిస్తూ బాలీవుడ్ లో దూసుకు పోతోంది. శ్రీమతి గా మారినా ఫోటో షూట్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ మునుపటి కంటే ఘాటుగా రెచ్చిపోతోంది. గ్లామర్ ప్రదర్శనకు పెళ్ళికి సెంటిమీటర్ కూడా సంబంధం లేదనే విషయన్ని పదే పదే అదే పనిగా ఋజువు చేస్తోంది.

రీసెంట్ గా దీపిక ఒక సూపర్ హాట్ ఫోటో షూట్ చేసింది. అందులో నుంచి ఒక ఫోటో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “రెడ్- జనాలకు కోరిక కలిగేలా చేస్తుంది. ఎరుపు రంగు ఇతరులను వెంటనే ఆకర్షిస్తుంది.. జనాలను ఎగ్జైట్ చేస్తుంది.. ఉత్సాహం తెప్పిస్తుంది.. హృదయ స్పందనల ను పెంచుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు నేను రెడ్ కలర్ ను ఎంచుకున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి రెడ్ కలర్ లిప్ స్టిక్ తో యమా హాట్ గా కనిపిస్తోంది. మెడ లో సన్నగా ఉండే గోల్డ్ చెయిన్స్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్.

ఈ ఫోటోల కు లైకు లే లైకులు.. ఇప్పటివరకూ 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో కు దీపిక పతిదేవులు.. రణవీర్ సింగు గారు వెంటనే స్పందించి “నువ్వు క్యాప్షన్ లో చెప్పిన వన్నీ నాకు కలుగుతున్నాయి” అంటూ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. ఇక అంతటి తో డిస్కషన్లు ఆగవు గా. ఒక నెటిజన్.. “రణవీర్ భాయ్ నువ్వు ఎగ్జైట్ కాకుండా.. ఎనర్జిటిక్ గా లేకుండా ఉండేది ఎప్పుడో చెప్పు” అంటూ ఒక పంచ్ విసిరాడు. ఈ విషయాలు పక్కన పెట్టి దీపిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయాని కి వస్తే ప్రస్తుతం ‘ఛపాక్’.. ’83’ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer