అందగత్తెల ఫ్యాషన్ ఏమిటో ఈ ఒగల్ గిగల్

0

నీ జీను ఫ్యాంటు చూసి బుల్లెమ్మోవ్.. మనసు లాగేత్తోంది లాగేత్తోంది! అంటూ యమలీల చిత్రంలో అలీ చేసిన సందడిని అంత తేలిగ్గా మర్చిపోలేం. అలీ- ఇంద్రజ జోడీ డ్యాన్సులతో అదరగొట్టారు. ఆ సంగతేమో కానీ.. ఇదిగో ఇక్కడ ఈ ఫ్యాషనిస్టాలను చూస్తే మరోసారి “నీ జీను ఫ్యాంటు చూసి బుల్లెమ్మో“ అనకుండా ఉండలేం. టాప్ టు బాటమ్ డెనిమ్స్ లో అదరగొట్టేశారు.

బాలీవుడ్ ఫ్యాషనిస్టాలు కత్రిన కైఫ్.. దీపికా పదుకొనే ఒకరితో ఒకరు పోటీపడుతూ ఈ సరికొత్త లుక్ తో వేడెక్కిస్తున్నారురు. ఆ ఇద్దరికీ డ్రెస్సింగ్ సెన్స్.. ఫ్యాషన్ ప్రపంచంపై ఉన్న ఆసక్తి అలాంటిది. ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్స్ ని.. ట్రెండీ డిజైన్స్ ని ఎంచుకోవడంలో ఎప్పుడూ పోటీపడుతుంటారు.

దీపికా పదుకొనే ఇటీవలే విమానాశ్రయంలో ఇలా యాసిడ్ వాష్ డెనిమ్ జంప్ సూట్ లో కనిపించింది. ఈ జీన్స్ వదులుగా ఉండడం దానికి తోడు ఆ నడుమును చుట్టేసిన బెల్టును చూడగానే ఆ కొలతల్ని యూత్ ఊహించుకునేంతగా ఎలివేషన్ కుదిరింది. దీపికతో పోటీపడుతూ కత్రిన సైతం సేమ్ డ్రెస్ లో పండగ చేసింది. పెద్ద కార్గో పాకెట్స్ తో మ్యాచింగ్ జంప్సూట్ అదిరిపోయింది. ఇదో తరహా బ్యాగీ జంప్ సూట్. ఈ తరహా డ్రెస్సింగ్ స్టైల్ విహారయాత్రల్లో.. ఏవైనా ఇళ్లలో ఆటలు ఆడుకునేప్పుడు ధరిస్తారట. ప్రస్తుతం దీపిక వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇక కత్రిన సల్మాన్ భాయ్ సరసన అవకాశం వస్తే వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్న క్యాట్ కెరీర్ పరంగా కొంత నెమ్మదిగానే వెళుతోందని అర్థమవుతోంది.
Please Read Disclaimer