ఎరక్కపోయి ఇరుక్కుపోయిన స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ఎన్నో హోప్స్ పెట్టుకుని నటించిన చపాక్ బాక్సాఫీస్ ఓపెనింగుల వద్ద తీవ్రంగా నిరాశరిచింది. నిర్మాతగా తొలి సినిమా ఇలా అవ్వడం దీపికను అప్సెట్ చేసిందట.

చపాక్ దీపిక కెరీర్ లోనే లీస్ట్ ఓపెనింగులతో నిరాశపరచడంపై బాలీవుడ్ వర్గాలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా తొలి రోజు కేవలం 4.77 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీపిక నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఫైండింగ్ ఫ్యానీ సైతం డే వన్ లో 5.10 కోట్లు వసూలు చేయగా చపాక్ అంతకంటే తక్కువ వసూలు చేయడం తనని తీవ్ర కలతకు గురి చేస్తోందట.

అయితే ఇలా ఎందుకయ్యింది? అంటే.. అందుకు రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే జేఎన్.యు ఘటనలో విద్యార్థుల వివాదంలో తలదూర్చడం ఒకటి అయితే.. తానాజీ 3డి లాంటి భారీ చిత్రానికి ఎదురెళ్లి రిలీజ్ చేయడం మరో ముప్పుగా మారిందని విశ్లేషిస్తున్నారు. జేఎన్.యు వర్శిటీ విద్యార్థుల వివాదంలో తలదూర్చి దీపిక అన్ని రకాలుగానూ తలంటించుకుంది. దీంతో విద్యార్థులు స్వచ్ఛందంగానే చపాక్ సినిమాని బ్యాన్ చేశారు. ఆ మేరకు టిక్కెట్లు కొనేవాళ్లు లేక బాక్సాఫీస్ పై ఆ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. ఇక తానాజీ 3డి భారీ అంచనాల నడుమ రిలీజై తొలి రోజు ఏకంగా 15 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు కారణాలు చపాక్ కి.. దీపిక ఆశలకు అలా చెక్ పెట్టేశాయని చెబుతున్నారు. అందుకే ఈ లేడీ ప్రొడ్యూసర్ కం నటిలో ఇంత తీవ్ర నిరాశ. అయితే చపాక్ కి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కాబట్టి ఓపెనింగ్ వీకెండ్ నాటికి కాస్తయినా రికవరీ అవుతుందేమో చూడాలి.
Please Read Disclaimer