చపాక్ వీడియో: మనుషుల అసలు రూపం ఇదే

0

దీపిక పదుకొనే కథానాయికగా మేఘన గుల్జార్ తెరకెక్కిస్తున్న చపాక్ ఈ జనవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. యాసిడ్ విక్టిమ్స్ ఈతి బాధలపైనా .. జీవితపోరాటంపైనా సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన టీజర్ – ట్రైలర్ – పోస్టర్లు అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళ్లాయి. ఆ క్రమంలోనే ఈ చిత్రంపై అంచనాలు అంతే పెద్ద స్థాయికి చేరుకున్నాయి.

దీపిక పదుకొనే రియల్ విక్టిమ్ లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటిస్తూ నిర్మాతగానూ కొనసాగుతుండడంతో ఈ సినిమాకి అన్నీ తానే అయ్యి ప్రచారం చేస్తోంది. ఇప్పటికే చపాక్ టైటిల్ సహా ట్రైలర్ అందరికీ నోటెడ్ అయ్యింది. తాజాగా యాసిడ్ బాధితురాలి వెతల్ని కళ్లకు కట్టే ఓ వీడియోని చపాక్ బృందం రిలీజ్ చేసింది.

యాసిడ్ బాధితురాళ్లు పబ్లిక్ లోకి వెళితే అక్కడ ప్రజల ఒరిజినల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అన్న కాన్సెప్టును డిజైన్ చేసి కొన్ని షాపింగ్ మాల్స్.. మార్కెట్ ప్లేసుల్లో హిడెన్ కెమెరాల్ని ఉంచి పరిశీలించారు. ముంబై కొలాబా అనే చోట ఈ ప్రయోగం చేశారు. దీపిక పదుకొనే సహా తనతో పాటు నటించిన రియల్ యాసిడ్ బాధితురాళ్లు ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నారు. సహజంగానే మనిషి అసలు స్వరూపం ఇలాంటప్పుడే బయటపడుతుంటుంది. యాసిడ్ దాడి వల్ల వికృతంగా మారిన దీపికను తన గ్యాంగ్ ని చూసేందుకు మాల్స్ లో జనం కొంత బెరుకుగానే కనిపించారు. తమకు దగ్గరగా వస్తున్న వారిని చూసి దూరం జరిగే ప్రయత్నం చేశారు. కొందరైతే ముఖం తిప్పేసుకున్నారు. పిల్లల్ని అటువైపు చూడనీకుండా ముఖం దాచేస్తూ జాగ్రత్త పడ్డారు. అక్కడ మాల్ లో కనిపించే వారంతా బాగా విధ్యాధికులే కావడం ఇక్కడ కొసమెరుపు. ఎవరు ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా అందం విషయంలో రూపం విషయంలో ఎలాంటి ఫీలింగ్ తో ఉంటారో ఈ ప్రయోగంతో బయటపడింది. వికృతమైనది రూపం కాదు.. మనసు అన్నది పక్కాగా ప్రూవ్ అయ్యింది.
Please Read Disclaimer