హీరోయిన్ ను చూసి అసహించుకున్న జనాలు!

0

దీపికా పదుకునె ప్రధాన పాత్రలో గుల్జార్ మేఘనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛపాక్’. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంను ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ చిత్రంకు దీపికా స్వయంగా నిర్మాత అవ్వడం వల్ల చాలా యాక్టివ్ గా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. గత నెల రోజులుగా ప్రమోషన్ ను చాలా విభిన్నంగా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక తాజాగా యాసిడ్ బాధితులు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు.. వారిని చూడగానే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాలను చూపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీపిక పదుకునే కూడా యాసిడ్ బాధితురాలిగా మరియు ఆమెతో పాటు మరో ఇద్దరు యాసిడ్ బాధితురాల్లు మొబైల్ షాప్ మార్కెట్ రోడ్ ఇలా పబ్లిక్ ప్లేస్ లలో తిరగడం జరిగింది. ఆ సమయంలో జనాల ఎక్స్ ప్రెషన్స్ ను హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు.

కొంత మంది వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే మరికొందరు చూడగానే మొహం చీదరించుకున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా వారిని చూడగానే భయంతో పక్కకు తప్పుకున్నారు. ఒక మహిళ తన పిల్లాడిని వారిని చూడకుండా కళ్లు మూసేందుకు ప్రయత్నించింది. యాసిడ్ బాధితులు కూడా మనుషులే కదా వారి పట్ల ఎందుకు మరీ ఇంత కఠిన వైఖరి అంటూ దీపిక పదుకునే ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఛపాక్ సినిమాకు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది. ఇలాంటి పనులతో మరింతగా జనాల్లోకి సినిమా వెళ్తుంది. దీపిక చేసిన ఈ ప్రయోగంను జనాలు ఏ స్థాయిలో ఆధరిస్తారో తెలియాలి అంటే ఈనెల 10వ తారీకు వరకు వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer