ప్రముఖ ఫోటోగ్రాఫర్ పై మండిపడిన స్టార్ హీరోయిన్!

0

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం పై అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతో బాధపడ్డారు. అలా ఎందుకు చేశాడా.. అని ఇంకా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ సుశాంత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి దారులన్నీ తెరుచుకుంటున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి పై ఇంకా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తుండగా.. ఇటీవలే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సుశాంత్ ఆత్మహత్య గురించి ఓ ఫోటోగ్రాఫర్ పై మండిపడింది. సినీ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో వివరించే అవసరం లేదు.ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను.. తమ ఫోటోల ద్వారా.. వారి వీడియోల ద్వారా అభిమానులకు చేరవేస్తుంటారు. మాములుగా అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు ఎక్కడ కనబడినా ఫోటోగ్రాఫర్ల కెమెరాలో బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ హీరో సుశాంత్ సింగ్ అంతియ యాత్రకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోలో.. “సుశాంత్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తున్నట్లు మొత్తం కనిపిస్తోంది. దీని పై సదరు ఫోటోగ్రాఫర్ స్పందిస్తూ.. ‘దయచేసి నా ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్ఫామ్లోనూ పోస్ట్ చేయరాదు’ అంటూ మెన్షన్ చేసాడు.

తాజాగా ఈ వీడియో గురించి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించింది. ‘అవునా. మీకు ఈ వీడియో తీయడం సరైనదేనా..? సుశాంత్ కుటుంబం అనుమతి లేకుండా దీనిని సోషల్ మీడియోలో పోస్ట్ చేయడమే కాకుండా దీని ద్వారా డబ్బు సంపాదించడం భావ్యమేనా..’ అంటూ దీపికా ఆ ఫోటోగ్రాఫర్ పై మండిపడింది. దీపికా స్పందన పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు పొగిడేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి విషయం గురించి మాట్లాడినందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Please Read Disclaimer