రాణీ హంస కేరాఫ్ మానస సరోవరం

0

పొడుగు కాళ్ల సోయగం దీపిక పదుకొనే ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడిన ఈ భామ ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం 83 చిత్రంలో రణవీర్ టైటిల్ పాత్ర పోషిస్తుంటే అందులో అతడికి భార్యగా నటిస్తోంది. రియల్ లైఫ్ పాత్రనే తెరపైనా పోషిస్తూ ఆకట్టుకోనుంది. అలాగే మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చపాక్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో యాసిడ్ ఎటాక్స్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ లీడ్ పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే దీపిక మామ్ అయ్యే టైమ్ దగ్గరపడిందని ప్రచారమైంది. బుల్లి పద్మావతి పుడుతుందా? లేక బుజ్జి రాక్ స్టార్ పుడతాడా? అంటూ ఆన్ లైన్ లో డిబేట్ రన్ అయ్యింది. ఇక 83 చిత్రంలో రణవీర్ నాటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు కాబట్టి మరో కపిల్ దేవ్ పుడతాడంటూ జోకులు వేశారు ఫ్యాన్స్. అదంతా దీపికకు ఆటవిడుపు అనుకుంటే.. మరో యాంగిల్ గురించి చర్చించాలి.

డిప్స్ అన్నివేళలా ఫ్యాషన్ ఐకన్ గా యూత్ గుండెల్లో నిలుస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ లో కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. వైట్ లో దీపిక మానససరోవరం నుంచి దిగొచ్చిన రాణీ హంసనే తలపించింది. వైట్ షర్ట్ మీద స్లీవ్స్ .. పాయింటెడ్ కాలర్ దానికి కాంబినేషన్ గా వైట్ బాటమ్ ఫ్యాంట్ లో ఎంతో రిలాక్స్ డ్ అప్పియరెన్స్ తో కనిపించింది. రెడ్ లిప్స్.. ఐ లైనర్ తో సంథింగ్ స్పెషల్ కాంబినేషన్ సెట్ చేశారు. ఈ ఔట్ ఫిట్ కి తగ్గట్టే చేతికి సింపుల్ గాజులు.. చెవులకు రింగ్స్ అలంకరించుకుంది. ఇలా ఏదో ఒక ప్రత్యేకత చూపించి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యూత్ కి కనెక్టవుతోందనే భావించాలి.
Please Read Disclaimer