రెడ్ హాట్ బికినీలో శ్రీమతిగారు

0

గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొనే ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. పద్మావతిగా నటించినా.. చపాక్ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా నటించినా తన నటనకు ఫిదా కాని అభిమాని లేడు. ఇక రెగ్యులర్ గా హబ్బీ రణవీర్ సింగ్ తో కలిసి దీపిక టెంప్టింగ్ ఫోటోషూట్లకు అంతే ఫాలోయింగ్ ఉంటోంది. ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీలపై దీపిక రెగ్యులర్ ట్రీట్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకించి చర్చ సాగుతుంటుంది.

ఇంతకుముందు ఆల్ ఇండియా జర్నల్ కోసం దీపికా పదుకొనే చేసిన ఫోటోషూట్ జోరుగా వైరల్ అయ్ఇయంది. మార్చి 2020 లో ఈ ఫోటోషూట్ సెన్సేషన్ అయ్యింది. ఇక అప్పట్లోనే నీలి సముద్రపు అంచుల్లో దీపిక ఫోటోషూట్ కిర్రాక్ పుట్టించింది. సముద్రతీరంలో సిజ్లింగ్ లుక్ వేడెక్కించింది. అలాగే
ఫెమినా ఇండియా కవర్ పేజీకి సంబంధించి దీపిక ఫోటోషూట్ ఇన్ స్టా ఫాలోవర్స్ లో జోరుగా వైరల్ అయ్యింది.

తాజాగా దీపిక ఎల్లే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ లో పాల్గొంది. రెడ్ హాట్ బికినీతో దీపిక నెవ్వర్ బిఫోర్ అన్నంతగా చెలరేగిపోయింది. ఇక రెడ్ బికినీలో దీపిక ఒంపుసొంపుల లావణ్యం మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజనులు కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా – వాట్సాపుల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. దీపిక ప్రస్తుతం 83 చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కి జోడీగా నటించింది. కపిల్ దేవ్ జీవిత భాగస్వామి రోమి దేవ్ పాత్రలో నటించింది. ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. దీంతో పాటు శకున్ బాత్రా సినిమాలో దీపిక నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా టైటిల్ ని ఇంకా నిర్ణయించలేదు. ఇందులో దీపికతో పాటు.. అనన్య పాండే – సిద్ధాంత్ చతుర్వేది తదితరులు నటించనున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-