నాకు ప్రెగ్నెన్సీ వస్తే మీకు కనిపించదా?

0

బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా హీరోయిన్స్ కు పెళ్లి అయ్యింది అంటే ఆ తర్వాత సంవత్సరం నుండే లేదంటే ఆరు నెలల నుండే తల్లి కాబోతుంది అంటూ వార్తలు మొదలు అవుతాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఆ హీరోయిన్ గురించిన వార్తలు వస్తూనే ఉంటాయి. తల్లి కాబోతుంది.. డెలవరీ కి సిద్దంగా ఉంది.. తల్లి కావాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ చాలా మంది గురించి ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే తల్లికాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ఛపాక్’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సమావేశంలో దీపిక మాట్లాడింది. ఆ సందర్బంగా ఒక జర్నలిస్ట్ మీరు తల్లి కాబోతున్నారా అంటూ ప్రశ్నించాడు. మీరు తల్లి కాబోతున్నట్లుగా మీడియా లో ముఖ్యంగా సోషల్ మీడియా లో చాలా వార్తలు వస్తున్నాయి. దీని పై మీరు స్పందించాలంటూ కోరాడు. అందుకు దీపిక మాట్లాడుతూ.. మీకు నేను పెగ్నెంట్ లా కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నించింది.

నా ప్రెగ్నెన్సీ గురించి నా కంటే మీకు ఎక్కువ ఆతృత ఉన్నట్లుంది. నేను ఎప్పుడు తల్లిని కావాలో మీరే చెప్పంది. మీరు అనుమతించినప్పుడు తల్లిని అవుతాను అంటూ మీడియాపై విసురుకుంది. ఒక వేళ నేను గర్బవతిని అయితే దాచాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను దాచినా కూడా నేను గర్బవతిని అనే విషయం మీకు కనిపించదా.. తెలియకుండా ఉంటుందా అంటూ అసహనం వ్యక్తం చేసింది. మళ్లీ మళ్లీ ప్రెగ్నెంట్ వార్తలు వస్తుండటం చిరాకు తెప్పిస్తున్నాయంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-