#MEETOO: క్రికెటర్లపై దీపిక సంచలన ఆరోపణలు

0

పని చేసే చోట వేధింపుల వ్యవహారంలో మీటూ ఉద్యమం ఎంత సంచలనమైందో తెలిసిందే. తను శ్రీ దత్తా తెర రంగ ప్రవేశంతో అదో సెన్సేషన్ అయ్యింది. నానా పటేకర్ కి వ్యతిరేకంగా తనూకి మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ఈ వేదికపై అండగా నిలవడంతో ఉద్యమం మరింత సక్సెసైంది. నానా పటేకర్ సహా పలువురు నటులు.. దర్శక నిర్మాతలపై కోర్టు కేసులు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం కొందరికి క్లీన్ చిట్ వచ్చేయడంతో అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే తాజాగా దీపికా పదుకొణే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొనే మాట్లాడుతూ.. మీటూ వివాదంలోకి భారత క్రికెటర్లు సహా విదేశీ క్రికెటర్లను లాగింది. సినీ పరిశ్రమలోనే కాదు మహిళలను వేధించిన వారిలో క్రికెటర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. పలువురు పారిశ్రామిక వేత్తలు అంటూ ఆ రంగాన్ని కూడా వేలెత్తి చూపించడం సంచలనమైంది.

సినిమా నిర్మాతలు దర్శకులు అంతా వేధించిన వారైతే? క్రికెటర్లు ఏమైనా మహత్ములా? అంటూ దీపిక కాస్తంత ఘాటుగానే ప్రశ్నించింది. తన వరకూ లైంగిక వేధింపులేవి ఎదురవ్వనప్పటికీ బాధితులను చూసి బాధ కలిగిందని వాపోయింది. సినిమా వాళ్లనే కాదు…క్రికెటర్లను ప్రశ్నించాలని ఓ ఇంటర్వూ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెటర్లలో కొందరు మంచి వాళ్లు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు. కానీ వారిపై వచ్చిన ఆరోపణలు మాత్రం హైలైట్ కాలేదు. మీడియా దాన్ని ఫోకస్ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకన్ క్రికెటర్లు అర్జున రణతుంగ- లసిత్ మలింగ పేర్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీటూ ఉద్యమంలో భాగంగా వినిపించిన సంగతి తెలిసిందే.




Please Read Disclaimer