చపాక్ ని అలా కిల్ చేసారా దీపికా?

0

ఇటీవలే దీపికా పదుకొణే నటించి..నిర్మించిన చపాక్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో ఒదిగిపోయిందని.. దీపిక నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే సరిగ్గా అదే సమయంలో జెఎన్ యూ విద్యార్ధుల వివాదంలో అనవసరంగా దీపిక వేలు పెట్టడం అనంతరం తనకు వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. సీఏఏ బిల్లుకు వ్యకతిరేఖంగా ఉంటావా? అంటూ దీపికపై విద్యార్థులు సహా నెటిజనం నిప్పులు చెరిగారు.

చపాక్ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం దీపిక ఇలా స్టూడెంట్స్ వెంటపడుతుందని విమర్శలు ఎదురయ్యాయి. చపాక్ సినిమాను బహిష్కరించాలని..ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు. # బాయ్ కాట్ ఛపాక్ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీపిక దేశ ద్రోహి అంటూ విద్యార్థులు నినందించారు. సామాజిక దృక్ఫథంతో సినిమా చేస్తుందని అనుకున్నాం! కానీ దీపిక మైండ్ లో ఇంతటి నెగెటివ్ ఆలోచన ఉందనుకోలేదని వ్యతిరేకించారు. దీపిక తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో చపాక్ బాక్సాఫీస్ రిజల్ట్ మారిపోయింది. సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది.

చపాక్ మంచి టాక్ తెచ్చుకున్నా వివాదానికి తోడుగా.. బాలీవుడ్ వెబ్ సైట్లు సైతం రేటింగ్ లతో సినిమాను కిల్ చేసే ప్రయత్నం చేసాయి. ప్రఖ్యాత ఐమ్ డీబీ వెబ్ సైట్ మొదటగా ఆ సినిమా కు 8.5 రేటింగ్ ఇచ్చింది. కానీ దీపికపై వస్తోన్న వ్యతిరేకత కారణంగా 4.6గా కుదించింది. తాజాగా ఓ రేడియో కార్యక్రమంలో దీపిక వీటన్నంటికి బదులిచ్చే ప్రయత్నం చేసింది. వాళ్లు నా సినిమా రేటింగ్ మార్చగలరు గానీ…నా మైండ్ సెట్ ని కాదు…అందులో ఆలోచనల్ని కాదంటూ సెటైరికల్ గా రియాక్ట్ అయింది.
Please Read Disclaimer