అతడిని వదిలేయడం నాకో పెద్ద వరం

0

బాలీవుడ్ కు చెందిన మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా రణబీర్ కపూర్ మరియు దీపికా పదుకొనే పేరు దక్కించుకున్నారు. ఈ జంట దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. వీరిద్దరు సహజీవనం కూడా సాగించారు అనేది బాలీవుడ్ లో అప్పుడు జరిగిన చర్చ. వీరిద్దరి నాలుగు సంవత్సరాల ప్రేమకు కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో ప్రేమలో ఉన్నాడు.

ఇద్దరు కూడా తమ బ్రేకప్ కు సంబంధించి స్పష్టమైన కారణం చెప్పలేదు. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు మొన్నటి వరకు దీపికా పదుకొనే ఆసక్తి చూపించ లేదు. ఈమద్య ఆ విషయాల పై పొడి పొడి గా స్పందిస్తూ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రణబీర్ కపూర్ తో విడి పోవడం పై స్పందించింది. ఆయన తో విడి పోవడం నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. నా జీవితంలో జరిగిన గొప్ప పనిగా నేను దానిని భావిస్తున్నాను.

రణబీర్ ఎప్పుడు కూడా ఇచ్చిన కమిట్ మెంట్ ను నిలుపుకునే వాడు కాదు. అతడి గురించి తెలుసుకునేందుకు నాకు కొంత సమయం పట్టింది. అతడి గురించి పూర్తిగా తెలిసేప్పటికి ఆలస్యం అయ్యింది. అయినా కూడా నేను అతడిని వదిలేయడం జీవితంలో చాలా పెద్ద విషయం. కొన్ని సంఘటనలు జరగడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఆ బ్రేకప్ వల్ల కూడా నాకు మంచి జరిగింది. అందుకే అది దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను అంటూ దీపికా పదుకొనే పేర్కొంది.
Please Read Disclaimer