లవ్ ఎఫైర్స్ పై దీపిక బోల్డ్ కామెంట్స్

0

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కానీ అవి మూడో కంటికి తెలియవు. అయితే బాలీవుడ్ లో అలా కాదు. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ లో తన జీవితంలో ఉన్న అమ్మాయిల సంఖ్య చెప్పి అందరినీ షాక్ కు గురి చేస్తాడు. నిజానికి గిన్నిస్ బుక్ వారు ఈ చిలక్కొట్టుడు వ్యవహారాలకు రికార్డులు ఇవ్వరు కానీ ఇస్తే మాత్రం.. సంజయ్ దత్.. సల్మాన్ ఖాన్ లాంటి ఘటికులు ఈపాటికి ఎప్పుడో ఘనమైన రికార్డులు సృష్టించి ఉండేవారు. ఇక వీరి స్థాయిలో కాకపోయినా ఇతర హీరోలు కూడా లవ్ ఎఫైర్స్ లో మునిగి తేలుతూ ఉంటారు. ఈ మధ్య ఇలాంటి టాపిక్ పైనే దీపిక పదుకొనె ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

రీసెంట్ గా దీపిక పదుకొనె.. రణ్ వీర్ సింగ్.. విజయ్ దేవరకొండ.. అలియా భట్… రణబీర్ కపూర్..ఆయుష్మాన్ ఖురానా.. మనోజ్ బాజ్ పాయ్ లు ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటీనటుల ప్రేమ వ్యవహారాలపై దీపిక మాట్లాడుతూ తమకు సిగ్గు లేదని వ్యాఖ్యానించింది. “నేను.. రణబీర్ కపూర్ ప్రేమించుకున్నాం.. అయితే రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్నాను. ఇప్పుడు రణబీర్- అలియా పెళ్ళి చేసుకుంటున్నారు” అని ఓపెన్ గా చెప్పేసింది. ఈ కామెంట్స్ చేసే సమయంలో భర్త రణవీర్ సింగ్ అక్కడే ఉన్నాడు. అయితే రణబీర్ – అలియా పెళ్ళిపై స్పందిస్తూ అలియా మా పెళ్ళి విషయం నువ్వు ఎలా ధృవీకరిస్తావు?” అంటూ ప్రశ్నించింది. నిజమే రణబీర్ కపూర్ కు ఈ తరం బాలీవుడ్ కాసనోవా అని పేరు. అతనితో పెళ్ళి పీటలు ఎక్కే క్షణంవరకూ ఎవరూ పక్కాగా చెప్పలేరు.. రణబీర్ తో సహా!

ఇవన్నీ పక్కన పెడితే మాజీ ప్రియుడు.. ప్రస్తుత ప్రియుడు.. భర్త.. మాజీ భర్త ఇలా అందరూ పక్క పక్కనే కూర్చుని పకోడీలు తింటూ ప్రేమాయణాల గురించి జోకులు వేసుకుంటూ ఉండడం ప్రపంచం లో ఎక్కడా చూడలేం.. అదంతా బాలీవుడ్ కే సొంతం. ఎంతైనా బాలీవుడ్ నటీనటుల రాగం తాళం వేరప్పా!
Please Read Disclaimer