అమ్మా నాన్న అవుతున్నారా? ఏంటీ టీజింగ్?

0

అందాల కథానాయిక దీపిక పదుకొనేని ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల ప్రేమాయణం అనంతరం ఈ జంట 2018లో ఓ ఇంటివారయ్యారు. పెళ్లి తర్వాత నెక్ట్స్ ఈవెంట్ ఏది? అంటే మమ్మీ డాడీ అవ్వడమే కదా? ప్రతిసారీ ఈ జంటకు మీడియా నుంచి ఇదే ప్రశ్న రిపీటెడ్ గా ఎదురవుతూనే ఉంది. అందుకు తగ్గట్టే ఈ జంట కూడా కవ్వింతగా తెలివైన ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు ఈ జోడీ సామాజిక మాధ్యమాల్లో సరసాలు చూస్తుంటే ఇక మమ్మీ డాడీ అయ్యేందుకు సమయం దగ్గర పడిందనే అర్థమవుతోంది. బేబి రాకకు వెళాయిందనే క్లూ అందింది. `హాయ్ డాడీ… ` అంటూ దీపిక కొంటెగా ఒక బేబిని- హృదయం ఈమోజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే … దానికి రిప్లయ్ ఇచ్చిన రణవీర్ .. `హాయ్ బేబి` అంటూ క్లూ ఇచ్చేశాడు. వీళ్లిద్దరికీ `గుండే` కోస్టార్ అర్జున్ కపూర్ ఇచ్చిన రిప్లయ్ స్పెక్యులేషన్ కి మరింత ఆజ్యం పోసింది. `బాబా.. బాబీ (అన్నయ్య – వదిన) ఇద్దరూ కలిసి ఒకటి ఇవ్వబోతున్నారు!“ అంటూ అంతే చిలిపిగా మాట కలిపాడు.

మొత్తానికి దీప్ వీర్ జంట `మమ్మీ డాడీ` అయ్యే టైమ్ దగ్గరపడిందనే అర్థమవుతోంది. బుల్లి పద్మావతి పుడుతుందా? లేక బుజ్జి రాక్ స్టార్ పుడతాడా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. పబ్లిక్ వేదికపైనే లవ్ కపుల్ సరసం ఫ్యాన్స్ ని చాలానే టీజ్ చేసింది. రణవీర్ సింగ్ ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ 83లో నటిస్తున్నాడు. ఇందులో దీపిక పదుకొనే ఆసక్తికర పాత్రలో నటిస్తోంది. రణవీర్ నాటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer