మరోసారి శ్రీదేవి జ్ఞాపకాల్లో బాలీవుడ్

0

సౌత్ నుండి బాలీవుడ్ వెళ్లి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి దాదాపు రెండు సంవత్సరాలు కాబోతున్నా కూడా ఆమె కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ స్టార్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమెను మర్చి పోలేక పోతున్నారు. ఏదో ఒక సందర్బంలో శ్రీదేవిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి శ్రీదేవిని బాలీవుడ్ సెలబ్రెటీలు గుర్తుకు తెచ్చుకున్నారు. శ్రీదేవిపై సత్యర్థి నాయక్ బయోగ్రఫీని రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఆ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునె ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆమె బుక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీదేవి ఒక గొప్ప నటి మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఆమె జీవితం అందరికి ఆదర్శం అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. శ్రీదేవిగారి జీవిత చరిత్ర బుక్ ను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఈ సందర్బంగా దీపిక పదుకునెతో పాటు బోణీ కపూర్ ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎమోషన్ అయ్యారు. దీపిక పదుకునె కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ పుస్తకంలో ముందుమాటగా ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజోల్ మాటలు ఉన్నాయి. శ్రీదేవి ఒక గొప్ప నటి అని.. నటనకు శ్రీదేవి ఒక డిక్షనరీ వంటి వారంటూ కాజోల్ వ్యాఖ్యలు చేశారు.
Please Read Disclaimer