మన్నించాలి.. పెట్టింది నా డబ్బు!- దీపిక

0

యాసిడ్ దాడి బాధితురాలు .. సామాజిక కార్యకర్త లక్ష్మీ అగర్వాల్ జీవితకథతో తెరకెక్కుతున్న చపాక్ త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ – పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలో దూసుకెళ్లాయి. ఈ చిత్రంలో దీపిక ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి నటించిందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ముంబైలో టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టైటిల్ పాట వింటున్న లక్ష్మి అగర్వాల్ తో పాటు దీపిక తీవ్ర ఉద్వేగానికి గురైంది. ముఖ్యంగా శంకర్ మహాదేవన్ ఎమోషనల్ సింగింగ్ వీక్షకుల గుండెల్ని టచ్ చేసింది. ఇక ఈ వేదికపై ఉన్న దీపికకు ఊహించని ఓ ప్రశ్న ఎదురైంది. అసలు ఈ సినిమాకి పెట్టుబడి పెట్టింది ఎవరు? మీ ఆయన గారు రణవీర్ సింగ్ నా? అని ప్రశ్నించగా… హలో ఎక్స్ క్యూజ్ మి.. ఆ డబ్బు పెట్టింది నేను! అంటూ దీపిక ఆన్సర్ ఇచ్చింది.

దీపిక నిర్మించిన మొదటి చిత్రమిది. అందుకే.. ఊహించని ఆ ప్రశ్న ఒక్క క్షణం తనను కలవరపాటుకు గురి చేసింది. వాస్తవానికి డబ్బు పెట్టడం కంటే దీపిక ఎంతో రిస్క్ తీసుకుని ఈ మూవీ కోసం శ్రమించిందని ఇప్పటికే రిలీజైన విజువల్స్ చెప్పాయి. ప్రస్తుతం ఈ సినిమాతో పాటుగా.. కపిల్ దేవ్ బయోపిక్ 83లోనూ రణవీర్ సింగ్ సరసన దీపిక నటిస్తున్న సంగతి తెలిసిందే. చపాక్ తో పాటుగా 83 చిత్రాన్ని దీపిక ఏకకాలంలో నిర్మించింది. జనవరి 10న చపాక్ చిత్రం అజయ్ దేవగన్ `తానాజీ 3డి`కి పోటీగా రిలీజవుతోంది.
Please Read Disclaimer