కరోనా పై కొత్త ఛాలెంజ్ విసిరిన దీపికా..

0

ప్రమాదకరమైన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ భయాందోళనలకు గురవుతున్నాయి. ఎప్పుడు ఏ విధంగా ఈ కరోనా వ్యాపిస్తుందోనని దేశ ప్రజలు కూడా కంగారు పడుతున్నారు. అయితే కరోనా నివారణ చర్యల గురించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూ – కరోనాను నివారించే సింపుల్ చిట్కాలను కూడా వైద్యుల పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే కరోనా నివారణ గురించి మేము కూడా అభిమాలనుకు అవగాహన కల్పిస్తామంటూ సినీతారలు కదిలివస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె కూడా ట్విట్టర్ వేదికగా కరోనా నివారణ కై అవగాహన కల్పించే ఒక మార్గాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లుంది. ట్విట్టర్ వేదికగా ‘సేఫ్ హాండ్స్ ఛాలెంజ్’ అనే కొత్త విధానాన్ని వీడియో రూపంలో ప్రవేశపెట్టింది. ఆ వీడియోలో ఆంటీ బయోటిక్ లిక్విడ్ తో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించింది. అంతేగాక ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి – క్రిస్టియానో రోనాల్డో – రోజర్ ఫెదరర్ లకు ఈ ఛాలెంజ్ ను సవాల్ గా విసిరింది. చూడాలి మరి ఎలాంటి స్పందన రానుందో.. కానీ దీపికా ప్రారంభించిన ఈ కొత్త ఛాలెంజ్ ని మాత్రం ట్విట్టర్ లో అభినందనల వెల్లువ మొదలైంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-