COVID-19! సెల్ఫ్ లవ్.. సెల్ఫ్ కేర్ తోనే సేఫ్

0

కోవిడ్ 19 వైరస్ ప్రపంచాన్ని చుట్టబెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారీకి ఇప్పటికే 6వేల మంది పైగా మరణించారు. లక్ష మంది పైగా కరోనా భారిన పడ్డారు. భారతదేశం లో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ ఉధృతి భయపెట్టేస్తోంది. అందుకే పలువురు సెలబ్రిటీలు రంగంలోకి దిగి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ప్రజల్లో అవేర్ నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ అభిమానుల్ని అప్రమత్తం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

ఆ కోవలోనే దీపిక పదుకొనే కరోనా భూతంపై అలెర్ట్ చేసే ప్రయత్నం చేసింది. రెగ్యులర్ గా ఉండే సూపర్ బిజీ షెడ్యూళ్లను సైతం పక్కన పెట్టేసిన దీపిక సోషల్ మీడియాలో తన సాధా సీదా ఫోటోని షేర్ చేసి..“సీజన్ 1: ఎపిసోడ్ 2… COVID-19 ఉత్పాదకత సమయమిది“ అంటూ పోస్ట్ ను పెట్టి.. ఈ పోస్ట్ కి #selflove #selfcare అనే హ్యాష్ట్యాగ్లను జోడించింది. పరిశుభ్రంగా ఉండడం.. మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారానే ఈ మహమ్మారీని తరిమికొట్టగలం అనే సందేశాన్ని ఇచ్చింది దీపిక.

దీపిక సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ని తీసుకుని ప్రజల్లో అవేర్ నెస పెంచే ప్రయత్నం చేయడం తో అది అందరిలోకి వైరల్ గా వెళ్లింది. దీపికను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ నామినేట్ చేశారు. “సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ టెడ్రోస్!“ అంటూ దీపిక రిప్లయ్ ఇచ్చింది. COVID19 ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజారోగ్యం భద్రతా అవసరం. మనమందరం కలిసి పోరాడుదాం“ అని దీపిక ట్వీట్ చేసింది. సోషల్ మీడియా ఛాలెంజ్ తీసుకోవడానికి రోజర్ ఫెదరర్.. క్రిస్టియానో రొనాల్డో .. విరాట్ కోహ్లీలను ఆమె ట్యాగ్ చేసింది. ఇలా ఒకరు మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ లో చేర్చడం ద్వారా # సేఫ్ హ్యాండ్స్ సవాలు తో # COVID19 ను ఓడించగలమన్న ధీమా వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది పారిస్ ఫ్యాషన్ వీక్ లో లూయిస్ విట్టన్ బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహించాల్సిన దీపిక కరోనావైరస్ మహమ్మారి కారణంగా తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. పారిస్ ఫ్యాషన్ వీక్ లో లూయిస్ విట్టన్ `ఎఫ్.డబ్ల్యూ 2020` ప్రదర్శనకు హాజరు కావడానికి దీపికా పదుకొనే ఫ్రాన్స్ కు వెళ్లాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ఫ్రాన్స్ లో కొత్త దశలోకి ప్రవేశించిందనే వార్తలతో ఆమె పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది.

2015 బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రం `ది ఇంటర్న్` హిందీ రీమేక్ లో నటించేందుకు దీపిక ఇటీవల సంతకం చేసింది. ఆ చిత్రంలో రాబర్ట్ డి నిరో – అన్నే హాథ్ వే ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ వెర్సన్ లో దీపికతో పాటు రిషీకపూర్ నటించనున్నారు. కబీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా `83` లో దీపిక తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించింది. ఇందులో రణ్వీర్ కపిల్ దేవ్ పాత్రలో.. దీపిక కపిల్ దేవ్ భార్య రోమి భాటియా పాత్రలో నటించింది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-