హీరోగారిలో మ్యాటర్ మైనస్ అనేసిందేమిటి?

0

ఆ యంగ్ హీరోని అందరూ చాక్లెట్ బోయ్ .. లవర్ బోయ్ అంటూ పొగిడేస్తుంటారు. కానీ సదరు హీరోలో ఆ మ్యాటర్ మాత్రం మైనస్ లో ఉందని షాకిచ్చింది ఆ మాజీ లవర్. ఇంతకీ ఎవరా హీరో .. ఎవరా ప్రేమికురాలు? అని ప్రశ్నిస్తే.. ఇంకెవరు.. బాలీవుడ్ చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ .. పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొనే గురించే ఇదంతా.

కరణ్ జోహార్ షోలో దీపికా పదుకొనే పాల్గొన్న ఒక త్రోబ్యాక్ వీడియో క్లిప్ తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒకప్పటి ప్రియుడు రణబీర్ గురించి దీపిక షాకింగ్ కామెంట్స్ చేసింది. అతగాడి గొప్పతనం గురించి చెబుతూనే .. దీపిక చెప్పిన ఓ సంగతి మాత్రం అభిమానులు జీర్ణించుకోలేనిదిగా ఉంది.

దీపికా పదుకొనే రణబీర్ కపూర్ ను `దయనీయ ప్రియుడు` అంటూ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. అసలు రణబీర్ కపూర్ సెక్సప్పీల్ పై రేటింగ్ ఇవ్వాలంటే ‘మైనస్ వన్’ అనేసింది దీపిక. బాయ్ ఫ్రెండ్ గా రణబీర్ దారుణమని నేను భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించింది. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసి విడిపోయినప్పటి ఇంటర్వ్యూ అది. రణబీర్ – దీపిక జంట రొమాన్స్.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఎంతో ఇదిగా భావించే అభిమానులకు ఆ వ్యాఖ్య షాక్ నిచ్చిందనే చెప్పాలి.

ఒక సహనటుడిగా రణబీర్ ఎలా ఉంటాడు? అన్న ప్రశ్నకు అతడు చాలా పరధ్యానంలో ఉంటాడని ఆన్ సెట్స్ ఏకాగ్రతతో ఉండడని చెప్పి షాకిచ్చింది. “నిజాయితీగా చెప్పాలంటే నేను పనిచేసిన మంచి సహనటులలో అతను ఒకడు కాదు. వృత్తిపరంగా అతడు చాలా పరధ్యానంలో ఉంటాడు. ఎదుటివారి ఏకాగ్రతకు భంగం కలిగిస్తాడు“ అని చెప్పింది. సహనటికి నిరంతరం ఆహారం ఇచ్చి బొద్దెక్కేలా చేస్తాడు. సాటి నటులు అతని కంటే చెత్తగా కనిపించేలా చేస్తాడు. చలి ప్రదేశంలో చిత్రీకరణ సాగేప్పుడు మీకు చలిగా అనిపిస్తే అతని జాకెట్ ని ఎప్పటికీ ఇవ్వడు. బదులుగా అతడు మీకు రెండు వేడి నీటి సీసాలు ఇస్తాడు. అకస్మాత్తుగా మీరు వేడెక్కిపోతారు! అంటూ రకరకాల అనుభవాల్ని గుర్తు చేసుకుంది మాజీ ప్రేయసి దీపిక. రణబీర్ ప్రస్తుతం ఆలియా భట్ తో డీప్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారమవుతోంది. రణబీర్ తో బ్రేకప్ తర్వాత రణవీర్ సింగ్ ని దీపిక ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసినదే.
Please Read Disclaimer