దీపిక.. హండ్రెడ్ పర్సెంట్ డెడ్లీ

0

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ దీపిక పదుకొనె ఈమధ్య సినిమాలను సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటోంది. గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన దీపిక ఈమధ్య మాత్రం మంచి కంటెంట్ ఉండే సినిమాలకు మాత్రమే ఓటేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎలాంటి రూల్స్ లేవు. రణవీర్ సింగ్ తో వివాహం జరిగిన తర్వాత కూడా ఫ్యాషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. శ్రీమతి అయినా హాటుఫోటోలు పోస్ట్ చేస్తూ గతంలో కంటే యాక్టివ్ గా ఉంటోంది.

రీసెంట్ గా దీపిక ఒక సూపర్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలో దీపిక బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ డిజైన్ ఉన్న బ్లాక్ కలర్ టాప్.. టోర్న్ జీన్స్ తరహాలో ఉండే ఒక లూజ్ ప్యాంట్ ధరించి ఒక కిటికీ దగ్గర యమా స్టైలిష్ గా నిలుచుంది. ఒక చేతిని జేబులోనూ..మరో చేతిని తలపైన పెట్టుకొని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోల్ దీపిక ఫ్లాట్ యాబ్స్ చూస్తే తను ఫిట్నెస్ ను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో మనకు అర్థం అవుతుంది. ఈ ఫోటోను కనుక గ్లామర్ తపస్వి రాఘవేంద్రరావు గారి అభిమానులు చూస్తే ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. లక్షల కొద్దీ లైక్స్ తో.. షేర్లతో నెటిజన్లు హోరెత్తించారు. దీపిక ను బ్యూటీ క్వీన్ అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే దీపిక ప్రస్తుతం ‘ఛపాక్’.. ’83’ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer